క్రైమ్ వార్తలు

ఐఐటీ-ఢిల్లీ ఫెస్ట్‌లో దారుణం.. విద్యార్థినుల వాష్‌రూంలో సీక్రెట్ కెమెరాలు

  • ఐఐటీ-ఢిల్లీ ఫెస్ట్‌లో శుక్రవారం ఫ్యాషన్ ‌షో
  • షోలో పాల్గొనేందుకు వచ్చిన భారతీ కళాశాల విద్యార్థినులు
  • దుస్తులు మార్చుకునేందుకు వారు ఉపయోగించిన బాత్రూంలో రహస్య కెమెరాలతో రికార్డింగ్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతులు
  • కాంట్రాక్ట్ స్వీపర్ అరెస్ట్, జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు

ఐఐటీ-ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఫెస్ట్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థినుల వాష్ రూంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు. ఫెస్ట్‌లో భాగంగా ఓ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన భారతి కళాశాల విద్యార్థినులు దుస్తులు మార్చుకునేందుకు వినియోగించిన వాష్‌రూంలో రహస్య కెమెరాలతో చిత్రీకరణ జరిగింది.  ఈ మేరకు వారు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఘటనాక్రమాన్ని వివరిస్తూ బాధితులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై తాము ఫిర్యాదు చేసినా ఐఐటీ-ఢిల్లీ యాజమాన్యం పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ కాంట్రాక్ట్ స్వీపర్‌ను (20) అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Related posts

ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య

Ram Narayana

కేరళలో జీవ సమాధి కలకలం… మృతదేహాన్ని బయటికి తీసిన పోలీసులు!

Ram Narayana

ఎమ్మెల్యే ఇంట్లో పీఏ ఆత్మహత్య

Ram Narayana