ప్రమాదాలు ...

దారుణం.. బాణసంచా పేలి 11 మంది దుర్మరణం

  • కర్ణాటకలోని అత్తిబెలెలోగల గోడౌన్‌లో ఘటన
  • శివకాశి నుంచి వచ్చిన బాణసంచా లోడు దించుతుండగా చెలరేగిన మంటలు
  • క్షణాల్లో వ్యాపించిన మంటల్లో చిక్కుకుని షాపు యజమానితో సహా 11 మంది మృతి

కర్ణాటకలో బాణసంచా పేలి ఏకంగా 11 మంది దుర్మరణం చెందారు. బెంగళూరు నగర శివారు ప్రాంతంలో తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆనేకల్ తాలూకా అత్తిబెలెలో శనివారం ఈ దారుణం జరిగింది. అక్కడి నవీన్ గోడౌన్‌కు తమిళనాడు శివకాశి నుంచి బాణసంచా లోడు వచ్చింది. లోడు వాహనాల నుంచి దించుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నాలుగు దుకాణాలు, ఒక మినీ కంటైనర్, రెండు పికప్ వాహనాలు కాలిపోయాయి. క్షణాల్లో వ్యాపించిన మంటల్లో చిక్కుకుని షాపు యజమానితో సహా మొత్తం 11 మంది దుర్మరణం చెందారు.

Related posts

యూఎస్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు తెలుగువారు స‌హా ఐదుగురు భార‌తీయుల దుర్మ‌ర‌ణం!

Ram Narayana

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 62 మంది దుర్మరణం…

Ram Narayana

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు కోబ్రా కమాండోల దుర్మరణం…

Ram Narayana