Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ … మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించనున్న ఈసీ!

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ … మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించనున్న ఈసీ!
నేటి మధ్యాహ్నం ఎన్నికల తేదీల,నోటిఫికేషన్ ప్రకటన
చత్తీస్‌గఢ్ సహా మిగతా రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్
మధ్యప్రదేశ్‌‌, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో నేరుగా తలపడనున్న బీజేపీ-కాంగ్రెస్
తెలంగాణలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ముక్కోణపు పోటీ

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ నేడు ప్రకటించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశంలో తేదీలను ప్రకటిస్తూ.. ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలపైనా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వివరించనున్నారు .ఎన్నికల షడ్యూల్ ప్రకటించిన వెంటనే కోడ్ అమల్లోకి రానున్నది .దీంతో ప్రభుత్వం చేపట్టే వివిధ కొత్త పథకాలు అమలుకు నోచుకోవు ..

2018లో పైన పేర్కొన్న ఐదు రాష్ట్రాల్లోని నాలుగింటిలో ఎన్నికలు ఒకే దశలో జరిగాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న చత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు దశల్లో జరిగాయి. షెడ్యూల్ ప్రకటన తర్వాత ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల వేడి రాజుకోనుంది. మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్-బీజేపీ నేరుగా తలపడనున్నాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కన్నేసిన బీజేపీ అధికారంలోకి రావడమే పరమావధిగా పావులు కదుపుతోంది.

మరోవైపు, కేంద్రంలో తిరుగులేని శక్తిగా మారిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. మొత్తం 25 పార్టీలతో కలిసి ఏర్పడిన ఈ కూటమి బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. అయితే, ఇండియా కూటమి తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అంతేకాదు, ఇందులోని పార్టీలు ఆయా రాష్ట్రాల్లోని శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయి.

తెలంగాణాలో 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా , రాజస్థాన్ లో 200 స్థానాలకు , మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు , ఛత్తీస్ ఘడ్ లో 90 స్థానాలకు ,మిజోరాం లో 40 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి విడతలవారీగా కాకుండా ఒకేసారి ఎన్నికలు జరిపే అవకాశం ఉందని తెలుస్తుంది…12 గంటలకు ఎన్నికల షడ్యూల్ ప్రకటించనున్నారని తెలియగానే అధికార పార్టీ ఆగిపోయిన స్కిములు పంపిణీకి పరుగులు పెడుతుంది…

Related posts

ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న వింత సంఘటన!

Drukpadam

పొంగులేటికి ఊరట.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కౌంటర్‌ ఆదేశం

Drukpadam

జూనియర్ డాక్టర్లపై కేసీఆర్‌ ఆగ్రహం…

Drukpadam

Leave a Comment