- కేబీసీ వేదికగా బిగ్‌బీ పుట్టినరోజు వేడుకలు
- తన కోసం నిర్వాహకులు పలు సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారని తెలిసి బిగ్‌బీ భావోద్వేగం
- కేబీసీలో జరుపుకునే పుట్టినరోజు వేడుకలే అత్యుత్తమమైనవంటూ కామెంట్
- వైరల్‌గా మారిన ఎపిసోడ్ ప్రోమో
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు వేడుకలకు ఆయన అభిమానులు రెడీ అయిపోతున్నారు. రేపు ఆయన పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు కేబీసీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బీ పుట్టినరోజు వేడుకలకు షో నిర్వహకులు అనేక సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారు. ఇది తెలుసుకున్న బిగ్‌బీ భావోద్వేగానికి లోనయ్యారు.
‘‘ఇక ఆపండి.. ఇంకెంత ఏడిపిస్తారు? హాట్‌సీట్‌లో భావోద్వేగానికి లోనయ్యే వారికి కళ్లు తుడుచుకునేందుకు నేను టిష్యూలు ఇస్తుంటాను. కానీ ఈసారి నాకు వాటి అవసరం పడింది. కేబీసీ వేదికగా జరిగే పుట్టినరోజు వేడుకలే అత్యుత్తమమైనవి’’ అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. రేపు ప్రసారం కాబోయే కేబీసీ ఎపిసోడ్‌లో ఈ దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ ఎపిసోడ్‌లో చిరంజీవి, విద్యాబాలన్, విక్కీ కౌషల్ తదితర సెలబ్రిటీలు పాల్గొంటున్నారు.