పాలేరుపాలేరులో అన్నకోసం తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి విస్తృత పర్యటనలు
గ్రామగ్రామాన కాంగ్రెస్ గ్యారంటీ వాగ్దానాలు ప్రచారం …
కాంగ్రెస్ ఎక్కడ పోటీచేయమంటే అక్కడ అన్నపోటీ చేస్తాడంటున్న ప్రసాద్ రెడ్డి ..
కాంగ్రెస్ పట్ల ప్రజల్లో మంచి ఆదరణ ఉందని వెల్లడి
ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశావహులు తాము పోటీచేయదల్చుకున్న నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు . తమకంటే తమకే సీటు వస్తుందనే విశ్వాసంతో పరుగులు పెడుతున్నారు . కాంగ్రెస్ లిస్ట్ ప్రకటించేందుకు మరో వారం పది రోజులు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు .అయితే ఎన్నికలు నెత్తిమీదకు వచ్చాయి. షడ్యూల్ ప్రకించారు . నవంబర్ 30 తేదీన ఎన్నికలు జరగనున్నాయి … ఎన్నికలకు తక్కువ సమయంలో ఉండటంతో నేతలు పరుగులు పెడుతున్నారు .పాలేరు నుంచి టికెట్ ఆశిస్తున్నమాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోసం తమ్ముడు ప్రసాద్ రెడ్డి రంగంలోకి దిగారు .పాలేరు నియోజకవర్గంలో గత పదిరోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు . హైద్రాబాద్ లో జరిగిన కాంగ్రెస్ బహిరంగసభలో సోనియా గాంధీ ద్వారా విడుదల చేసిన 6 గ్యారంటీ పథకాలను గ్రామగ్రామాన ప్రచారం చేసే పనిలో ప్రసాద్ రెడ్డి నిమగ్నమైయ్యారు . గతంలో ఎప్పుడు కార్యాలయానికి మాత్రమే పరిమితమయ్యే ప్రసాద్ రెడ్డి నియోజకవర్గ పర్యటనలో బిజీ బిజీగా ఉండటం ఆసక్తిగా మారింది.. ఇంతకీ ప్రసాద రెడ్డి పోటీలో ఉంటారా…? లేక శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉంటారా …?అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి…
పాలేరు తమకే అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుయాయులు చెపుతుండగా లేదు లేదు పాలేరు తుమ్మలకే అని తుమ్మల వర్గీయలు సైతం అంటున్నారు .కాంగ్రెస్ లోనే మరికొందరు నేతలు తుమ్మల పాలేరు కోసం , పొంగులేటి కొత్తగూడెం కోసం పార్టీలో చేరారని అంటున్నారు . ఇంతకీ పాలేరు సీటు ఎవరికీ అనేది చర్చనీయాంశంగా మారింది . పొంగులేటి , తుమ్మల కల్సి సోమవారం హైద్రాబాద్ లోని పొంగులేటి నివాసంలో సమావేశమైయ్యారు . గతంలోనే అధిష్టానం పెద్దలు కీలకమైన ఈ ఇద్దరు నేతల పోటీ విషయమై చర్చింది . ఒకరు పాలేరు మరొకరు ఖమ్మం నియోజకవర్గాల నుంచి పోటీచేయాలని సూచించింది …అయితే ఎవరి వాదనలు వారు అధిష్టానం పెద్దల ముందు వివరించారు . అధిష్టానం కూడా సామజికవర్గ సమీకరణాలు ,అక్కడ వారు చేసిన కృషి ఆధారంగా తుమ్మల ఖమ్మంలో ,పొంగులేటి పాలేరు నుంచి పోటీచేయించేందుకు ఒప్పించే ప్రయత్నంలో ఉంది . దీంతో ఇద్దరు నేతలు హైద్రాబాద్ లో కలయికకు ప్రాధాన్యం ఏర్పడింది … పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరిన కొద్దీ రోజుల్లోనే కీలకమైన నేతగా గుర్తింపు పొందారు .ఆయనకు ప్రచార కమిటీ కో .చైర్మన్ గా భాద్యతలు అప్పగించారు . ఫలితంగా ఆయన తాను పోటీచేసే నియోజకవర్గంలోనే కాకుండా మిగతా నియోజకవర్గాలకు సమయం ఇవ్వాల్సి ఉంటుంది.. తుమ్మలతో కల్సి ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పర్యటించాలని వారు నిర్ణయించుకున్నారు . జిల్లాలో సీట్ల విషయంలో కూడా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి సర్వే ఆధారంగా ఎవరికీ సీటు ఇవ్వాలనేది నిర్ణయిస్తారని ఒక కీలక నేత అన్నారు . కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసి ఏఐసీసీ ఆమోదంతో లిస్టు ప్రకటించేందుకు మరో వారం రోజులు పట్టే ఆకాశం ఉందని తెలుస్తుంది…