Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ.. రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు

  • బాబు క్వాష్ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడే అవకాశం
  • బాబుకు ఉపశమనం కలిగే తీర్పు వస్తుందని ఆశిస్తున్నానన్న రఘురాజు
  • అమిత్ షాతో లోకేశ్ భేటీతో వైసీపీ ఆందోళనలో ఉందని వ్యాఖ్య

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. దీంతో, టీడీపీ శ్రేణులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఉపశమనం కలిగే తీర్పు వస్తుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు. 

కేసు ఎప్పుడు నమోదైనా, ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదయిందనే దాన్నే పరిగణనలోకి తీసుకోవాలనేది నిబంధనల్లో స్పష్టంగా ఉందని రఘురాజు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ యువనేత నారా లోకేశ్ భేటీ కావడం తమ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఈ సమావేశాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరే ఏర్పాటు చేసినట్టు తమ పార్టీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. పురందేశ్వరి సమావేశాన్ని ఏర్పాటు చేయించినట్టయితే… ఆ భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి సీఎం జగన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని…. ఇది ఆయన విపరీత మనస్తత్వానికి నిదర్శనమని రఘురాజు విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో జగన్ నివాసం ఏర్పాటు చేసుకున్నారని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పాడేరు, అరకు కూడా వెనుకబడి ఉన్నాయని… నివాసం అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు కదా? అని ఎద్దేవా చేశారు.

Related posts

అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేశ్‌పై కేసు…

Ram Narayana

రాజకీయాల్లోకి కృష్ణంరాజు భార్య.. ఆమె ఏమన్నారంటే..!

Ram Narayana

పెద్దిరెడ్డిపై ఒక రేంజ్ లో ఫైర్ అయిన చంద్రబాబు…కొమ్ములు విరిచేసి, కొవ్వు తగ్గిస్తానని హెచ్చరిక …

Ram Narayana

Leave a Comment