Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణాలో బీజేపీదే అధికారం డాక్టర్ పొంగులేటి , సునీల్ ధియోధర్….!

భారత్ ను ప్రపంచంలో శక్తివంత దేశంగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మోడిదే …పొంగులేటి , సునీల్ ధియోధర్
మోడీ నాయకత్వంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
తెలంగాణాలో అభివృద్ధి ,సంక్షేమం పరుగులు పెట్టాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి

భారత్ ను ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని నరేంద్ర మోడిదేనని బీజేపీ జాతీయనాయకులు తమళనాడు రాష్ట్ర బీజేపీ సహా ఇంచార్జ్ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి , బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ ధియోధర్ లు ఉన్నారు . శుక్రవారం ఖమ్మం సమీపంలోని జివిఆర్ ఫంక్షన్ హాల్‌లోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్ మరియు శక్తికేంద్ర బిజెపి సభ్యులనుద్దేశించి వారు ప్రసంగించారు . మోడీ నాయకత్వాన్ని దేశం కోరుకుంటుందని ,అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ ను నిలబెట్టిన ఘనత కూడా మోడిదేనని అన్నారు . మోడీ విశాల దృకపదం , దార్శనికత తో అనేక విజయాలు సాధించామని అన్నారు . దేశంలో శాంతిభద్రతలు కాపాడటంలో , సరిహద్దుల రక్షణలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేతమైన విధానాలవల్లనే సాధ్యమందని వారు పేర్కొన్నారు .

తెలంగాణాలో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ యస్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు . బీఆర్ యస్ నాయకత్వంలో అవినీతి తెలంగాణగా, అప్పుల తెలంగాణగా మారిందని వారు కేసీఆర్ విధానాలపై ధ్వజమెత్తారు .కేసీఆర్ ప్రభుత్వం యొక్క దుర్మార్గాలు, వైఫల్యాలు, అవినీతిని ఎండగట్టాలని వారు పిలుపునిచ్చారు . కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు చరమ గీతం పడాలని అన్నారు . బీఆర్ యస్ ,కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని అందువల్ల వారిలో ఎవరికీ ఓటేసిన రాష్ట్ర అభివృద్ధి వెనక్కు పోవడం ఖాయమన్నారు . రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేయాలని అందుకు బీజేపీ కార్యకర్తలు ప్రతి గడపకు ప్రచారాన్ని తీసుకోని పోవాలని కోరారు ..

ఈసమావేశంలో పాలేరు నియోజకవర్గ ఇంచార్జి కిషన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి,జిల్లా బీజేపీ అధ్యక్షుడు, గల్లా సత్యనారాయణ, , ఖమ్మం జిల్లా బీజేపీ ఇంచార్జ్ త్రిలోక్ నాయకులూ వాసుదేవరావు, నున్నా రవికుమార్ , శ్యామ్ రాథోడ్, విజయ, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…

Related posts

త్వరలో ప్రజల్లోకి వస్తున్నాను: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

Ram Narayana

కేటీఆర్ ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ఎన్నికల ప్రధాన అధికారికి కాంగ్రెస్ ఫిర్యాదు 

Ram Narayana

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ చతికిల పడడంపై కేటీఆర్ తొలి స్పందన…

Ram Narayana

Leave a Comment