Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన మెక్సికో మహిళా రాజకీయవేత్త

  • ఢిల్లీలో పీ20 సదస్సు
  • పలు దేశాల పార్లమెంటు స్పీకర్లతో సమావేశం
  • హాజరైన మెక్సికో సెనేట్ అధ్యక్షురాలు అనా లిలియా రివేరా
  • మోదీలో సోదరుడ్ని చూసుకున్న విదేశీ నేత

జీ20 దేశాల పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు (పీ20) న్యూ ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ఇవాళ, రేపు ఢిల్లీలో జరిగే ఈ పీ20 సదస్సుకు ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలుస్తోంది. నేడు ఏర్పాటు చేసిన పలు సెషన్లకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా పీ20 సదస్సు వేదిక వద్ద ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్ర మోదీకి మెక్సికో సెనేట్ అధ్యక్షురాలు అనా లిలియా రివేరా రాఖీ కట్టారు. మోదీని ఓ సోదరుడిగా భావిస్తున్నట్టు తెలిపారు. ఓ విదేశీ రాజకీయవేత్త తనకు రాఖీ కట్టడం పట్ల మోదీ హర్షం వెలిబుచ్చారు. అనా లిలియా తలపై చేయి వేసి దీవించారు. భారత్-మెక్సికో సంబంధాలు మరింత సుహృద్భావ ధోరణిలో ముందుకెళ్లాలని అభిలషిస్తున్నట్టు తెలిపారు.

Related posts

మూడవ రౌండ్ పూర్తి … పల్లా ఆధిక్యం 12142ఓట్లు

Drukpadam

రిపోర్ట‌ర్‌ను తిట్టిన బైడెన్.. త‌ర్వాత‌ సారీ!

Drukpadam

గవర్నర్లకు కీలక సూచనలు చేసిన వెంకయ్యనాయుడు!

Drukpadam

Leave a Comment