తెలంగాణ వార్తలుప్రమాదాలు ...

బొల్లారంలోని అమర్ ల్యాబ్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒకేసారి పేలిన రెండు రియాక్టర్లు

  • ప్రమాద సమయంలో నైట్‌షిఫ్ట్‌లో 15 మంది కార్మికులు
  • వారిలో 9 మందికి తీవ్రగాయాలు
  • సమీపంలోని ఆసుపత్రికి తరలింపు
  • పేలుడు శబ్దానికి ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీసిన స్థానికులు

హైదరాబాద్ శివారులోని పారిశ్రామిక ప్రాంతమైన బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి అమర్ ల్యాబ్స్‌లో గత రాత్రి రెండు రియాక్టర్లు ఒకేసారి పెద్ద శబ్దంతో పేలిపోయాయి. ప్రమాద సమయంలో 15 మంది కార్మికులు నైట్‌షిఫ్ట్‌లో పనిచేస్తుండగా వారిలో 9 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, పేలుడు శబ్దానికి భయపడిన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పరిశ్రమలో గాడాంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. లోపల ఎంతమంది చిక్కుకున్నారనే విషయంలో స్పష్టత లేదు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.

Related posts

ప్రజాప్రభుత్వాన్ని దీవించండి … పార్టీ అభ్యర్థులను గెలిపించండి…మంత్రి పొంగులేటి

Ram Narayana

బారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్…

Ram Narayana

తన పేరిట వసూళ్లు… పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం!

Ram Narayana