Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ యస్ పై బాలసాని గరం గరం …మంత్రి పువ్వాడ , ఎంపీ వద్దిరాజు బుజ్జగింపులు…

బీఆర్ యస్ పై బాలసాని గరం గరం …మంత్రి పువ్వాడ , ఎంపీ వద్దిరాజు బుజ్జగింపులు…
ఖమ్మం నియోజకవర్గ ఇంచార్జిగా ఉండాలి కోరిన నేతలు
పార్టీలో తనకు జరిగిన అవమానాలు చాలని వారిప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన బాలసాని
ఫోన్ లో మాట్లాడిన హరీష్ రావు , కేటీఆర్ …పార్టీలో తన స్థానంపై ప్రశ్నించిన బాలసాని
పార్టీలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఆగ్రహంతో ఉన్న బాలసాని
భద్రాచలం లో బుచ్చయ్య ను అభ్యర్థిగా పెట్టాలంటే వెంకట్రావు ను ఎందుకు పెట్టారని నిలదీత
తాను అడగకుండానే ఇచ్చిన నియోజకవర్గ ఇంఛార్జిని తొలగించి తాతా మధుకు ఇవ్వడం పై ఫైర్
ఎమ్మెల్సీ గా ఒక బీసీని తొలగించి తిరిగి బీసీకి ఇవ్వకుండా తాతా మధుకు ఎలా ఇచ్చారన్న బాలసాని
జిల్లా అధ్యక్షుడిగా బీసీని తొలగించి,మరో బీసీకి ఇవ్వకుండా తాతా మధుకు ఎలా ఇచ్చారన్న బాలసాని

జిల్లా బీఆర్ యస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పార్టీ పై గరంగరంగా ఉన్నారు .బీసీలకు కాంగ్రెస్ లో అన్యాయం జరుగుతుందని పొన్నాల లక్ష్మయ్య లాంటి వాళ్ళను బీఆర్ యస్ లోకి ఆహ్వానిస్తున్న తరణంలో ఖమ్మం జిల్లాలో ఒక బీసీ నేత తనకు బీఆర్ యస్ లో జరిగిన అవమానంపై బీఆర్ యస్ నేతలను ప్రశ్నించడం ఆపార్టీకి ఇబ్బందికరంగా మారింది… ఆయన్ను బుజ్జగించేందుకు జిల్లామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రంగంలోకి దిగారు . శనివారం బాలసాని ఇంటికి స్వయంగా వీరువురు నేతలు వెళ్లి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు . భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ గా తొలగించడం పై వారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు . ఖమ్మం నియోజకవర్గానికి ఇంఛార్జిగా ఉండాలని మంత్రి బాలసానికి పువ్వాడ , వద్దిరాజులు కోరారు .వారి ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు . మొదటి నుంచి ప్రత్యేకించి గత రెండు సంవత్సరాలుగా పార్టీలో తనకు జరుగుతున్న అవమానాల గురించి ప్రశ్నించారు .బాలసాని ఇంటికి వెళ్లిన నేతలు మంత్రులు హరీష్ రావు ,కేటీఆర్ లను బాలసానితో మాట్లాడించి చల్లబరిచే ప్రయత్నం చేశారు . పార్టీలో తనకు జరిగిన అవమానాలు గురించి వారితో కూడా ఒకింత కఠువుగానే బాలసాని మాట్లాడినట్లు సమాచారం ..2 గంటలకు పైగా బాలసాని నివాసంలో ఉన్న నేతలు చేసిన ప్రయత్నాలు ప్రశ్నర్డకంగానే మిగిలాయని తెలుస్తుంది…

బీఆర్ యస్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బాలసాని తిరిగి తనకు ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని ఆశించారు . కానీ అది ఇవ్వలేదు సరికదా పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాత్ర పెద్దగా లేదు …తాను కల్పించుకొని పోవడం తప్ప తనకు ఎలాంటి ప్రోటోకాల్ లేదని బాలసాని అనేక సార్లు సన్నిహితుల దగ్గర వాపోయారు . పువ్వాడ అజయ్ కు మంత్రి పదవి వచ్చిన కొత్తలో కొంత కాలం బాలసానిని వెంటవేసుకొని జిల్లాలో తిరిగి ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చారని బాలసాని అభిప్రాయపడుతున్నారు . .2018 ఎన్నికల్లో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి గా వ్యహరించానని ఇప్పుడు అదికూడా లేకుండా అకస్మాతుగా తొలగించడం అవమానంగా భావిస్తున్నారు … ఆ నియోజకవర్గ వాసి అయిన బాలసానికి నియోజకవర్గం గురించి పూర్తిగా అవగాహనా ఉన్నప్పటికి ఈసారి ఎందుకో ఆయన్ను పక్కన పెట్టడమే కాకుండా అక్కడ బుచ్చయ్య అనే అభ్యర్థికి టికెట్ ఇవ్వాల్సి ఉండగా ఆయన్ను కాదని కాంగ్రెస్ లో చేరిన తెల్లం వెంకట్రావు ను, తిరిగి బీఆర్ యస్ చేర్చుకొని టికెట్ ఇవ్వడంపై కూడా బాలసాని అభ్యంతరం వ్యక్తం చేశారు .అయినా ఆయన అభ్యంతరాలను పార్టీ పట్టించుకోలేదు ….

టికెట్ ఇచ్చారు సరే …నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న బాలసానిని తొలగించి ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు , ఎమ్మెల్సీ తాతా మధును భద్రాచలం నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించారు . దీనిపై బాలసాని తనకు అవమానం జరిగినట్లుగా మండిపడుతున్నారు . పార్టీలో తనకు ఎలాంటి పదవులు లేకుండా కొత్తగా వచ్చినవారికి అందులో బీసీలను కాదని ఇతర సామజిక వర్గాలవారికి ఇవ్వడంపై ఏమిటని అంటున్నారు . చివరకు ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడుగా బీసీ ఉండగా తిరిగి బీసీకి ఇస్తామని చెప్పి మోసం చేశారని వాపోతున్నారు …తాతా మధును ఎమ్మెల్సీ గా చేసి జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారని నాయకత్వంపై బాలసాని గుర్రుగా ఉన్నారు .

టీడీపీ ఏర్పడిన నాటినుంచి ఆపార్టీ వివిధ పదవులు అనుభవించిన బాలసాని తెలంగాణ ఏర్పడిన తర్వాత మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కల్సి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు . నాటి నుంచి పార్టీకి లాయల్ గా ఉంటున్నారు . ఎమ్మెల్సీ గా రెండు పర్యాయాలు చేశారు . టీడీపీలో డీసీఎంస్ చైర్మన్ గా , డీసీసీబీ చైర్మన్ గా జిల్లా టీడీపీ అధ్యక్షులు అనేక పదవులు నిర్వహించారు . బాలసాని బీఆర్ యస్ లో ఉంటారా లేక మరో దారి చేసుకుంటారా అనేది చూడాలి మరి ….!

Related posts

గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై ఈటల పోటీ… బీజేపీ సాహసోపేత నిర్ణయం

Ram Narayana

తెలంగాణ టీడీపీకి బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లోకి ఆ పార్టీ పొలిట్ బ్యూరో చీఫ్ రావుల!

Ram Narayana

తుమ్మ ముళ్లు బాగా గుచ్చుకున్నట్లేగా..: కేసీఆర్‌కు తుమ్మల చురక

Ram Narayana

Leave a Comment