Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అజయ్ అన్న వెంటే మేమంతా..ఖమ్మం కార్పొరేటర్లు శపథం…

అజయ్ అన్న వెంటే మేమంతా..ఖమ్మం కార్పొరేటర్లు శపథం…
వాడెవ్వడు వీడెవ్వడు అజయ్ అన్నకు అడ్డెవ్వడు అని నినదించిన కార్పొరేటర్లు…
అంతకు ముందు మమతా మెడికల్ కళాశాల లోని సమావేశ మందిరంలో సమావేశం
కాంగ్రెస్ లోకి కొంతమంది కార్పొరేటర్లు జంప్ అవ్వడంతో మంత్రి అజయ్ అలర్ట్ అయ్యారు
మిగతా వాళ్ళు ఎవరు పోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు

ఖమ్మంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బీఆర్ యస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ కు జైకొట్టడంతోపాటు మొదటి నుంచి తుమ్మల కు సన్నిహితంగా ఉన్న కార్పొరేటర్లు బీఆర్ యస్ కు బై చెప్పి కాంగ్రెస్ కు జై అన్నారు . దీంతో హైద్రాబాద్ బీఆర్ యస్ సమావేశంలో ఉన్న మంత్రి పువ్వాడ తన బీఫామ్ తీసుకోని హుటాహుటిన ఖమ్మం చేరుకొని డామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారు …కార్పొరేటర్లను అందరిని మమతా మెడికల్ కళాశాలకు పిలిపించి వారితో తాము పార్టీ మారబోమని గట్టి హామీ పొందారు …ఖమ్మంలో తాను చేసిన కృషిని వివరించి ముందుముందు వేల కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేసుకున్నాం ..నగరంలో చేసిన అభివృద్ధిని విదేశాల్లో ఉంటున్న మనవాళ్ళు ప్రశంసిస్తున్న విషయాన్నీ గుర్తు చేశారు . అనేకమంది ప్రలోభాలు పెట్టేందుకు పగటి వేషగాళ్ళు వస్తున్నారని వారిపట్ల జాగ్రత్తగా కార్పొరేటర్లు అందరు అప్రమత్తంగా ఉండాలని అన్నారు .

వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గ బీఆర్ యస్ పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్ అన్న వెంటే మేమంతా ఉంటామని కార్పొరేటర్లు అన్నారు .ఎవరెన్ని కుట్రలు చేసినా.. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టిన తమ స్వేదం చివరి బొట్టు వరకు ఎదురొడ్డి పోరాడి అజయ్ అన్నని గెలిపించుకుంటామని వారు శపథం చేశారు . వచ్చేది బీఆర్ యస్ ప్రభుత్వమే.. ఇక్కడ గెలిచేది మా అజయ్ అన్నే అని వారు అన్నారు ….జై అజయ్ అన్న.. జై బీఆర్ యస్ అంటు నినాదాలుచేశారు ..!! ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని కార్పొరేటర్లు నినాదాలతో హోరెత్తించారు..!!

Related posts

ఆ ఖాళీ స్థలంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం!: సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

ఈ నెల 7న మంత్రి కెటిఆర్ వ‌రంగ‌ల్‌ ప‌ర్య‌ట‌న‌…

Drukpadam

ఢిల్లీ బ‌య‌లుదేరిన‌ తెలంగాణ మంత్రుల బృందం

Drukpadam

Leave a Comment