కీంకర్తవ్యం … ఖమ్మం కాంగ్రెస్ నేతల సమాలోచనలు…
పార్టీ కోసం కష్టపడినా దక్కని టికెట్స్
కొత్తగా వచ్చినవారికి టికెట్స్ ఇవ్వడం పై మనస్తాపం
పార్టీ మారాలా వద్దా…? అనేదానిపై తర్జనభర్జనలు
రాయల నాగేశ్వరరావు కోసం బీఆర్ యస్ గాలం…
పోట్ల కోసం ప్రయత్నాలు …కల్సి పనిచేద్దామని పిలుపు
ఖమ్మం కాంగ్రెస్ లో ఎంతోకాలంగా ఉండి పార్టీకోసం పనిచేస్తూ టికెట్ రాకపోవడంతో కీంకర్తవ్యం అనే ఆలోచనలో పడ్డారు …పార్టీ టికెట్స్ కోసం సీరియస్ ప్రయత్నం చేసిన జిల్లా కాంగ్రెస్ నాయకులూ రాయల నాగేశ్వరరావు , పోట్ల నాగేశ్వరరావు , జావేద్ లు ఆదివారం రాత్రి ఖమ్మం లోని పోట్ల నివాసంలో సమావేశమై తమ భవిషత్ కార్యాచరణ పై సుదీర్ఘంగా చర్చించారు . పార్టీ కష్టాల్లో ఉన్నసమయంలో ఇల్లు వాకిళ్లు వదిలి డబ్బులు ఖర్చు పెట్టుకొని కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ ఇచ్చిన పిలుపులు జయప్రదం చేసినప్పటికీ తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన వారిని బలమైన అభ్యర్థులుగా చెప్పి వారికీ టికెట్స్ ఇవ్వడం ఏమిటి …? అలాంటప్పుడు తమతో ఖర్చులు ఎందుకు పెట్టించారని వాపోతున్నారు . భట్టి పాదయాత్ర సందర్భంగా , రాహుల్ గాంధీ ఖమ్మం వచ్చిన సందర్భంగా జరిగిన బహిరంగ సభకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టమని పార్టీ కోసం ఎవరు లేనప్పుడు తామే అంతా చూసుకున్న విషయం పార్టీ పెద్దలకు తెలుసునని వారు పేర్కొంటున్నారు . ఇంత కష్టపడినా రేపు పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి కొత్తగా వచ్చినవారికి వారి అనుయాయులకు ఎమ్మెల్సీలు , కార్పొరేషన్ ,రాజ్యసభ లాంటి పదవులు ఇస్తారు తప్ప తమను గుర్తించారని వారు మదనపడుతున్నారు …ప్రధానంగా పాలేరు టికెట్ ఆశించిన రాయల నాగేశ్వరరావు , కొత్తగూడెం టికెట్ ఆశించిన పోట్ల నాగేశ్వరరావు , ఖమ్మం టికెట్ ఆశించిన మహమ్మద్ జావేద్ లు సమాలోచనలు జరిపారు … ఈసందర్భంగా పార్టీ మారితే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా వారి మధ్య వచ్చినట్లు సమాచారం …అయితే అక్కడ కూడా కొత్తగా వెళ్లిన వారికీ పదవులు ఇస్తే పార్టీలో ఉన్నవారి నుంచి వ్యతిరేకత వస్తుందని అందువల్ల పార్టీ మార్పు ప్రతిపాదన పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు …
రాయలకు , పోటీలకు బీఆర్ యస్ గాలం
రాయల నాగేశ్వరావు , పోట్ల నాగేశ్వరరావు లకు బీఆర్ యస్ గాలం వేస్తున్నట్లు సమాచారం …టికెట్స్ దక్కకపోవడంతో వారితో టచ్ లోకి వెళ్లి పార్టీలో చేరాలా ఒప్పించాలని బీఆర్ యస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం …వారిలో అసంతృప్తి ఉన్నమాట నిజమేకాని పార్టీ మారతారని అనుకోవడంలేదని ఒక సీనియర్ కాంగ్రెస్ నేత అన్నారు .
గత ఎన్నికలకు ముందు బీఆర్ యస్ లో చేరిన పోట్ల నాగేశ్వరావు కొద్దీ రోజులో అందులో ఉండి బయటకు వచ్చారు …తర్వాత కాంగ్రెస్ లో చేరి పీసీసీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు …కొత్తగూడెం అసెంబ్లీకి పోటీచేయాలని ఉద్దేశంతో ఇంచార్జిగా భాద్యతలు తీసుకోని కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు . ఇప్పుడు పొత్తులో భాగంగా ఆ సీటు సిపిఐ కి కేటాయించారని వార్తలు వస్తున్నాయి.. ఇక రాయల నాగేశ్వరరావు ప్రజారాజ్యం పార్టీలో చేరి పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేశారు . తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరారు …పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా , ఉండి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు … పాలేరు సీటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేటాయించడంతో రాయన మనస్తాపానికి గురైయ్యారు…. ఇక జావేద్ ఆశించిన ఖమ్మం సీటు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు కేటాయించారు …
ముగ్గురు నేతలకు సీట్ల కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గట్టిగానే ప్రయత్నించినప్పటికీ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు , పార్టీ అవసరాల వారికీ అవకాశం దక్కలేదని తెలుస్తుంది.