Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ యస్ లో ఇంచార్జీలపైనే గెలుపు భాద్యతలు …

బీఆర్ యస్ లో ఇంచార్జీలపైనే గెలుపు భాద్యతలు …
ఎంపీ వద్దిరాజుకు ఇల్లందు , కొత్తగూడెం
మంత్రి అజయ్ కి మధిర భాద్యతలు
ఖమ్మం ఎంపీ నామ కు వైరా భాద్యతలు
సత్తుపల్లికి రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి
ఖమ్మం , పాలేరు , పినపాకలకు లేని ఇంచార్జిలు
భద్రాచలంకు ఎమ్మెల్సీ తాతా మధు …అశ్వారావుపేటకు శేషగిరిరావు

బీఆర్ యస్ పార్టీ మూడవసారి ఎన్నికల్లో గెలవడం ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని పకడ్బందీ చర్యలు చేపట్టి ,ప్రణాళిక బద్దంగా ముందుకు పోతుంది …ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించింది మొదలు నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను కూడా నియమించి గెలుపు భాద్యతలను వారి పై పెట్టింది..దీంతో పోటీచేసే అభ్యర్థులకన్నా ఇంచార్జీలే అన్ని తామై వ్యహరిస్తున్నారు ..తాము ఇంచార్జి గా ఉన్న అసెంబ్లీ గెలవకపోతే మైనస్ మార్కులు పడతాయనే అభిప్రాయంతో నిద్రాహారాలుమాని పరుగులు పెడుతున్నారు ..ఉదారణకు …ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి….వాటిలో ఖమ్మం ,పాలేరు,పినపాక మినహా అన్ని నియోజకవర్గాలకు గులాబీ బాస్ ఇంచార్జి లను నియమించారు .ఇప్పుడు వారు నియోజకవర్గాల్లో తిరుగుతూ అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలిస్తూ ,అసంతృప్తులను బుజ్జగిస్తూ అభ్యర్థులకు గైడ్ చేస్తూ తిరుగుతున్నారు .

మధిర కు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంచార్జిగా ఉన్నారు . ఆయన ఖమ్మం అభ్యర్థిగా తన ప్రచారం నిర్వహించుకుంటూ మధిరకు సమయం కేటాయిస్తున్నారు…మధిరలో అభ్యర్థి లింగాల కమల్ రాజ్ వెంట రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తిరుగుతున్నారు .సీనియర్ రాజకీయనాయకుడైన కొండబాల గతంలో మధిర ఎమ్మెల్యేగా పనిచేశారు .అంతే కాకుండా ఆయనకు మధిర వైరా నియోజకవర్గాల్లో అన్నిగ్రామాలతో మంచి సంబంధాలు వ్యక్తిగా పరిచయాలు ఉన్నాయి. అయితే ఎంతవరకు పనిచేస్తాయో తెలియదో చూడాలి …ఇక వైరా నియోజకవర్గానికి ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ను నియమించారు . ఆయన నియోజకవర్గంలో పర్యటనలు జరుపుతున్నారు . ఎక్కడ పోటీచేస్తున్న మదన్ లాల్ కు నియోజకవర్గంలో ఇక సత్తుపల్లికి రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి ఇంఛార్జిగా నియమించారు .కానీ ఆయన నియోజకవర్గానికి తక్కువ సమయం కేటాయిస్తున్నారు . అయితే అక్కడ పోటీచేస్తున్న సండ్ర వెంకటవీరయ్య గతంలు మూడు సార్లు అక్కడ నుంచి వరస విజయాలు సాధించారు . ఆయనకు నియోజకవర్గం మీద పంచి పట్టు ఉంది. అన్ని గ్రామాల్లో తన యంత్రాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు . అందువల్ల అక్కడ పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు …అశ్వారావు పేట ఇంఛార్జిగా డీసీఎంస్ చైర్మన్ శేషగిరి రావును నియమించారు . ఆయన తిరగలేక పోతున్నదని నియోజకవర్గానికి పెద్దగా సమయం కేటాయించే పరిస్థితి లేదని అంటున్నారు .దీనిపై ఉమ్మడి జిల్లా నాయకుల సమావేశంలో కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇక మరో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు ఇల్లందు , కొత్తగూడెం డబుల్ ధమాకా లాగా రెండు నియోజకవర్గాలు అప్పగించారు గులాబీ బాస్ . దీంతో ఆయన ఉరుకులు పరుగులు పెడుతున్నారు . అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు . ఈ రెండు నియోజకవర్గాలు సింగరేణి కాలరీస్ ఏరియాలో ఉన్నవే …వీటి గెలుపు భాద్యత ఎంపీ మీదనే ఉండటంతో నిద్రాహారాలు మాని తిరుగుతున్నారు . అయితే ఇతర పార్టీల నుంచి బీఆర్ యస్ పార్టీలో దేవుడెరుగు ఉన్న పార్టీలోనే అసంతృప్తులను సముదాయించడం ఆయన తలప్రాణం తోకకు వస్తుంది.. ప్రత్యేకించి ఇల్లందు అభ్యర్థిపై సొంత పార్టీ వారి నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది ..కొత్తగూడెం లో వనమా పట్ల ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు …ఇక ఇంచార్జి లేని నియోజకవర్గం పినపాక ఇక్కడ నుంచి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పోటీచేస్తున్నారు . భద్రాచలం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన బుచ్చయ్యను కాదని పొంగులేటితోపాటు కాంగ్రెస్ లో చేరిన డాక్టర్ తెల్లం వెంకట్రావుకి టికెట్ ఇవ్వడం ఇక్కడ ఇంచార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను పక్కన పెట్టి ,ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధును నియమించారు . దీంతో బాలసాని తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. రెండు మూడు నియోజకవర్గాలకు ఇంచార్జీలే లేకుండా ,ఉన్నదగ్గర ఉన్నవాళ్ళని ఉండనివ్వకుండా చేయడం పార్టీకి ప్రతికూలంగా మారుతుందనే అభిప్రాయాలూ ఉన్నాయి..

ఆర్జేసీ కృష్ణ కి జిల్లా సమన్వయం భాద్యతలు ….

ఇటీవల పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగిన బీఆర్ యస్ సీనియర్ నేత ఆర్జేసీ కృష్ణ కు జిల్లా సమన్వయ భాద్యతలు అప్పగించారు . ఆయనకు తోడుగా ఉప్పల వెంకటరమణ , కృష్ణ చైతన్య , పులిపాటి ప్రసాద్ , డోకుపర్టి సుబ్బారావు , పోలీస్ వెంకన్నలు సమన్వయ కమిటీలో సభ్యులుగా నియమించారు …

Related posts

బీఆర్ యస్ 16 ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఫైనల్…

Ram Narayana

నన్ను ఓడించేందుకు రూ. 300 కోట్లు పంపించారు: పొంగులేటి

Ram Narayana

భవిష్యత్ ముఖ్యమంత్రిని నేనే.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment