Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం ఖాసీం రజ్వీ పువ్వాడ అజయ్ …తుమ్మల ఫైర్

ఖమ్మం ఖాసీం రజ్వీ పువ్వాడ అజయ్ …తుమ్మల ఫైర్
బెదిరింపు రాజకీయాలను అడ్డుకునేందుకే ఖమ్మంలో పోటీ
సోనియా ,రాహుల్ గాంధీని ఒప్పించి ఖమ్మం వచ్చా ..
అమాయకులపై అన్యాయంగా పోలీసులు కేసులు
ఖమ్మంలో ప్రశాంతంగా జీవించే పరిస్థితిలు లేవని అంటున్నారు.
గతంలో అభివృద్ధి గురించి అడిగేవాళ్ళు ..ఇప్పుడు కేసులు భయపడుతున్నారు
కబ్జాలకు ,ఆక్రమణలు నిలయంగా ఖమ్మం
గజగజ వణుకుతున్న ప్రజలు ..నిజాం కాలంలో కూడా ఇంతటి నిరంకుశం లేదని మండిపాటు

ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు తన ప్రత్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ పై పదునైన విమర్శలు గుప్పింస్తున్నారు . ఖమ్మంలో ఖాసీం రజ్వీ పాలన కొనసాగుతుందని తెలంగాణ పోరాట కాలంలో రజ్వీ చేసిన ఆకృత్యాలు ప్రజలు కథలు కథలుగా చెప్పుకున్నారని ,ప్రజలను ఊచకోత కోశారని ,ప్రజల హక్కులు హరించబడ్డాయని , అలాంటి పాలననకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారని గుర్తు చేశారు .. ఖమ్మంలో అరాచకపాలన సాగుతుందని దాన్ని ఘోరికట్టేందుకే సోనియా ,రాహుల్ గాంధీని ఒప్పించి ఖమ్మంలో పోటీచేసేందుకు వచ్చానని అన్నారు .ఖమ్మం ప్రజలు ప్రశాంతజీవనం కోరుకునేవారు ..కానీ అది నేడు కొరవడింది …బెదిరింపులు ,కేసులు ఎక్కువైయ్యాయి. ఇలాంటి రాజకీయాలను మనం ఎప్పుడు చూడలేదు …ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యామంటే వారికీ సేవ చేసేందుకే అనేది గుర్తు పెట్టుకోవాలి . ఆదిమరిచిపోయి వ్యవహరిస్తే ప్రజలు తమకు అవకాశం వచ్చినప్పుడు వెంటబడి తరుముతారని హెచ్చరించారు …గతంలో రాజకీయాలు చూశాం ఎన్నికలవరకే అవిపరిమితమైయ్యేవి …కానీ నేడు అదీలేదు కక్ష్య పూరిత రాజకీయాలు నడుపుతున్నారు ..ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు …ఈ అక్రమాలను దౌర్జన్యాలను ఎదుర్కోవాలి …4 సంవత్సరాల 10 నెలలుగా ఖమ్మంలో ప్రజాస్వామ్యం ఖుని అయింది.. మాట్లాడితే కేసులు బెదిరింపులు అని ప్రజలు తమ బాధలను చెప్పుకుంటున్నారు . ప్రశాంతకు నిలయమైన ఖమ్మంలో దౌర్జన్యాలు జరగడానికి వీలులేదు … గతంలో తాను మంత్రిగా ఉండగా మంచినీళ్లు , వంతెనలు , చెక్ డ్యాంలు , రోడ్లు , సాగర్ నీళ్లు అడిగేవారు …ఇప్పుడు మామీద ఉన్న కేసులు తీసేపియ్యమని అడుగుతున్నారు ….ఇంతకన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏదైనా ఉందా..? అని తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు …

ప్రజల సమస్యల పరిస్కారం కోసం పోరాటాలు చేయడంలో తప్పులేదు …తాను మంత్రిగా ఉండగా కూడా చేశారు ..ప్రధానంగా కమ్యూనిస్టులు అనేక ఆందోళనలు నిర్వహించారు . వారు చేసే ఆందోళనలు అర్థం చేసుకొని సహాయం చేయాలి కానీ కక్ష్య పూరితంగా వ్యవహరించడం దుర్మార్గం .. పాలకుల వేధింపులకు ఖమ్మంలో బ్రతకటానికే భయపడుతున్నారు . గజగజ వణికి పోతున్నారు … మనం ఎక్కడ ఉన్నాం …అధికారం ఎవరికీ శాశ్వితం కాదు …తనకు వ్యతిరేకంగా ఉన్నారని ఏలూరు శ్రీనివాస్ రావుపై వేధించడం ఎంతవరకు సమంజసం …వ్యాపారాలు తమ వ్యాపారం సరిగా చేసుకోలేకపోతున్నామని భయపడుతున్నారు …విచ్చలవిడిగా బరితెగించి వేధించడం, భూకబ్జాలు , ఆక్రమణలు ,పోలీసులను అడ్డంపెట్టుకొని అక్రమకేసులు పెట్టడం , పీడీ యాక్ట్ లు , రౌడీ షీట్లు తెరిపిస్తామని బెదిరించడం నిజాం కాలంలో కూడా ఇంతటి అరాచకం ,నిరంకుశం చూడలేదని ప్రజలు భయపడుతున్నారని తుమ్మల ,మంత్రి అజయ్ విధానాలపై నిప్పులు చెరిగారు ..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని ,తాను ఇక్కడ నుంచి గెలిచి మీ అందరి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటానని హామీ ఇచ్చారు ..గతానికి భిన్నంగా తుమ్మల తన వాడి వేడి పదజాలంతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు . తనకు ఉన్న సంబంధాలను ,స్నేహాలను ,తాను మంత్రిగా ఉన్న సమయంలో సహాయం పొందిన వారు తుమ్మల దగ్గరకు వచ్చి మద్దతు ప్రకటించడం గమనార్హం….

Related posts

జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో డిప్యూటీ సీఎం భట్టి …

Ram Narayana

కలిసి నడుద్దాం బి.ఆర్.ఎస్ ను ఓడిద్దాం – సి.పి.ఐ పాలేరు నియోజకవర్గ సమావేశంలో పొంగులేటి…

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ ఎన్నికల ఇంచార్జిలుగా హేమ హేమీలకు భాద్యతలు !

Drukpadam

Leave a Comment