Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

సిపిఎం సీనియర్ నేత సామినేని రామారావు దారుణ హత్య …

సిపిఎం సీనియర్ నేత ,రాష్ట్ర రైతు సంఘం మాజీ అధ్యక్షులు ,చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సామినేని రామారావును ఈ తెల్లవారుజామున తన ఇంట్లో ఉండగానే గుర్తు తెలియని దుండగులు దారుణాతి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు …గత కొన్నివేళ్ళుగా ప్రశాంతంగా ఉన్న జిల్లా రాజకీయాల్లో రామారావు హత్య ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. సంచలనంగా మారిన ఈ హత్య pai

మంచి తనానికి మారుపేరుగా , మృదు స్వభావిగా ,పిలిస్తే పలికే నాయకుడిగా,నిర్మాణ దక్షుడిగా రామారావు కు పేరుంది . ప్రధానంగా పేదల పక్షపాతిగా వారితరుపున పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఆయనది . పార్టీలో ఆచెలంచలుగా ఎదిగి జిల్లా కమిటీ ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ,రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షునిగా ,ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కేంద్రం హైద్రాబాద్ లో ఉండి పనిచేశారు ..

గత నాలుగైదు దశాబ్దాలుగా సిపిఎం పార్టీకి సేవలందించిన రామారావు గత రెండు మూడేళ్ళుగా అన్ని బాధ్యతల నుంచి తప్పుకొని తన స్వగ్రామమైన పాతర్లపాడులో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు ..స్థానికంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు . తన గ్రామాన్ని సిపిఎం కంచుకోటగా మార్చారు …రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టి సత్తా చాటాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు …స్థానికంగా అందరితో కలివిడిగా ఉంటూ అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు ..ఆయన మిగతా పార్టీల నుంచి కూడా శత్రువులు ఎవరు లేరని అంటున్నారు.

కాంగ్రెస్ గుండాలు చేసిన హత్యే ..సిపిఎం

స్థానిక సంస్థల ఎన్నికలలో పాతరపాడు గ్రామపంచాయతీలో ఓడిపోతామని భయంతోనే కాంగ్రెస్ గుండాలు అత్యంత కిరాతకంగా కాపుకాసి హత్య చేశారని సీపీఐ(ఎం) ఆరోపించింది.

తెల్లవారుజామున తన ఇంట్లో ఉండగా కాంగ్రెస్ గుండాలు కాపుకాసి కత్తులతో పొడిచి చంపారని వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షలని సిపిఎం డిమాండ్ చేసింది . మృతదేహాన్ని ఖమ్మం సీపీ సునీల్ దత్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు తదితరులు సందర్శించారు. సామినేని రామారావు హత్యను సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Related posts

రౌడీయిజం ,గుండాయిజం ,రాజకీయ హత్యలు గురించి తుమ్మల మాట్లాడటం హాస్యాస్పదం ..మంత్రి పువ్వాడ కౌంటర్ ఎటాక్ ….

Ram Narayana

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు ఖమ్మం వర్తకుల వినతి

Ram Narayana

ప్రచారంలో దుమ్ము రేపుతున్న బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు…

Ram Narayana

Leave a Comment