Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జై ఈటల నినాదాలుతో మార్మోగిన టీఆర్ యస్ సమావేశం…

జై ఈటల నినాదాలుతో మార్మోగిన టీఆర్ యస్ సమావేశం…
-ఖంగుతిన్న టీఆర్ యస్ నేతలు
-ఈటల అనుకూల ప్రతికూల వర్గాల మధ్య ఘర్షణ
-పోలిసుల జోక్యం -సర్దుమణిగిన వివాదం
టీఆర్ యస్ హుజురాబాద్ నియోజకవర్గం లోని వీణవంకలో జరిగిన సమావేశంలో టీఆర్ యస్ కార్యకర్తలు ఈటలకు మద్దతుగా నినాదాలు చేయడంతో సమావేశ ప్రాంగణం జై ఈటల నినాదాలతో మారుమోగింది. ఈటల అనుకూల ప్రతికూల వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది . ఒకరిని ఒకరు తోసుకున్నారు .వాదులాడుకున్నారు. అక్కడ జరుగుతున్న పరిణామాలతో సమావేశానికి వచ్చిన నారదాసు లక్ష్మణ్ రావు తోపాటు మిగతా నాయకులు షాక్ కు గురైయ్యారు . పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది . వీణవంక మండలంతో మెజార్టీ టీఆర్ యస్ తోనే ఉందని సంబరపడుతున్న తరుణంలో జరిగిన ఈ సంఘటన టీఆర్ యస్ ను కలవరానికి గురిచేసింది. భూకబ్జా ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ అయిన ఈటలను మరింత బలహీన పరచాలని ,నియోజకవర్గంలో ఆయనకు ఉన్న పట్టును తగ్గించాలని టీఆర్ యస్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి.టీఆర్ యస్ ఎంత ఎక్కువగా ఆయనపై దృష్టి పెట్టి నియోజకవర్గ నాయకులను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారు. నాయకులు అమ్మడుపోతున్నారనే ప్రచారం జరుగుతుంది.దీనిపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నాయకులు అమ్మడు పోయిన మేము అమ్మడుపోము అంటూ సంఘటితం అవుతున్నారు.నిన్నటిదాకా ఈటల వెంట తిరిగిన నాయకులు నేడు టీఆర్ యస్ కు జైకొట్టడం ప్రజలు భగ్గుభగ్గు మంటున్నారు. అందులో భాగంగానే నారదాసు లక్ష్మణ్ రావు ఏర్పాటు చేసిన టీఆర్ యస్ సమావేశం జై ఈటల నినాదాలతో మార్మోగింది.దీంతో నాయకులు కంగుతిన్నారు.దీనిపై కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం .దీనిపై కేసీఆర్ కు హరీష్ రావు వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది.
శనివారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంకలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈటల వెంట ఎవరూ వెళ్లవద్దని కోరారు. వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీయే ముఖ్యమని అన్నారు.నారదాసు లక్ష్మణ్ రావు ఆ వ్యాఖ్యలు చేయగానే.. కొందరు కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు ఈటల వెంటే ఉండి, ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతారా…? అని నిలదీశారు. జై ఈటల అంటూ నినాదాలు చేశారు.ఈటల అనుకూల నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. దాంతో వేదికపై ఉన్న ఎమ్మెల్సీ లక్ష్మణ్ షాక్ తిన్నారు. ఈటలకు అనుకూలంగా నినాదాలు చేసిన వారిని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో సభ రసాభాసగా మారింది. పోలీసులు కల్పించుకొని వారిని బయటకు పంపించారు.టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ హుజురాబాద్ ప్రారంభించిన విషయం తెలిసిందే. నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఈటల వెంట వెళ్లకుండా చర్యలు చేపట్టింది. ఇటీవల మంత్రి హరీష్ రావు కూడా హుజురాబాద్ నేతలతో సమావేశమయ్యారు. తామంతా టీఆర్ఎస్‌తోనే ఉంటామని వారు చెప్పినట్లు తెలిసింది.మరోవైపు బీజేపీలో ఈటల రాజేందర్ చేరిక దాదాపు ఖాయమయింది జోరుగా ప్రచారం జరుగుతుంది. . ఒకటి రెండు రోజుల్లోనే ఢిల్లీకి వెళ్లనున్నట్లు బీజేపీ వర్గాలు లీకులు ఇస్తున్నారు . ఈటలను చేర్చుకునేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించిందని , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
ఈటలతో పాటు మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది . అయితే ఇప్పటికే తాను బీజేపీ లో చేరబోవడంలేదని ఈటల స్వయంగా ప్రకటించారు.ఈటల సన్నిహితులు మాత్రం అలాంటిది ఏమిలేదని ఇది అంట వట్టి ప్రచారమేనని కొట్టి పారేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2)న ఈటల రాజీనామా చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది . ఆయన బీజేపీలో చేరడంలేదని ప్రకటించిన తరువాత కూడా ప్రచారం జరగడం గమనార్హం …..

Related posts

నారా భువనేశ్వరి ప్రకటనపై అంబటి రాంబాబు స్పందన!

Drukpadam

బీజేపీపై ముకుల్ కుమారుడి ఫైర్,,,

Drukpadam

కృష్ణా కరకట్ట మీద ఉన్నది చంద్రబాబు ఇల్లు కాదు మిస్టర్ సజ్జల …వర్ల …

Drukpadam

Leave a Comment