తెలంగాణ, ఏపీ రాజకీయాలపై తుమ్మల కీలక వ్యాఖ్యలు
రెండు రాష్ట్రాల్లో అరాచకపాలన కొనసాగుతోందన్న తుమ్మల
ఇలాంటి అవినీతి, నిర్బంధ పాలనను చూడలేదని విమర్శ
బెదిరించి, అదిరించి ఎక్కువ కాలం రాజకీయాలు చేయలేరని వ్యాఖ్య
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో దారుణమైన రాజకీయాలు నడుస్తున్నాయని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. ఇలాంటి అవినీతి, నిర్బంధ పాలన తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ప్రతీకారాలకు పాల్పడలేదని చెప్పారు. ప్రతిపక్షాలను, ప్రజలను బెదిరించి, అదిరించి ఎల్లకాలం రాజకీయాలు చేయలేరని అన్నారు. తెలంగాణలో సుస్థిరమైన పాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని చెప్పారు. రాజకీయాల్లో నీతి ,నిజాయితీ అవసరమని అది కొరవడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు .ప్రజలకు మాట ఇస్తే తలతెగిపడిన ఇచ్చిన మాట నెరవేర్చాలని అదిలిపోవడం పైగా తమ విధానాలు సమర్ధించుకోవడం పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతుందని అన్నారు . ఖమ్మం అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయబోతున్న తుమ్మల నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు .ఇప్పటికే పలువురు అధికార బీఆర్ యస్ నుంచి తుమ్మల ఆధ్వరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు .. అటు అధికార పార్టీ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ తుమ్మల మధ్య ఖమ్మం పోరుపై ప్రజల్లో ఆసక్తి నెలకొన్నది ..
ఖమ్మం 14వ డివిజన్ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ తుమ్మల పైవ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు తుమ్మల సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు …పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కూడా చేరికల కార్యక్రమం కొనసాగింది … ఈకార్యక్రమంలో తుమ్మలతోపాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు …