Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ విజయం ఖాయం… సీఎం ఎవరన్నది పార్టీ నిర్ణయిస్తుంది: భట్టి

-నవంబరు 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

-కాంగ్రెస్ కు 74 నుంచి 78 స్థానాలు వస్తాయన్న భట్టి

-సీఎల్పీ భేటీ ఏర్పాటు చేసి సీఎంను ఎంపిక చేస్తామని వెల్లడి

-సీఎం ఎవరు అనేది సీఎల్పీ సమావేశంలో నిర్ణయం జరుగుతుంది… భట్టి
-అభ్యర్థుల లిస్టు త్వరలో ప్రకటిస్తారు …లెఫ్ట్ తో పొత్తు విషయం అధిష్టానం నిర్ణయిస్తుంది
-మధిర ప్రజల ఆశ్వీర్వచనాలే తనను ఇంతటివాణ్ణి చేశాయి
-ఆరు గ్యారంటీ పథకాలు…మా ప్రచారాస్త్రాలు

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 74 నుంచి 78 స్థానాలు వస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీ చూసుకుంటుందని తెలిపారు. సీఎల్పీ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. 

ప్రజా సంపద దోపిడీకి పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని వదిలించుకునేందుకు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రజల కలలు నిజం చేసేందుకు కాంగ్రెస్ పోరాడుతోందని భట్టి పేర్కొన్నారు. 

ఓడిపోతామన్న విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే గుర్తించారని, వారు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని భట్టి వెల్లడించారు.

సీఎం అభ్యర్థి ఎవరు అనేది సీఎల్పీ సమావేశంలో ప్రజాస్వామ్య యుతంగా నిర్ణయం జరుగుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు . మధిర పర్యటనలు మీడియాతో మాట్లాడిన భట్టి త్వరలోనే కాంగ్రెస్ జాబితా విడుదల అవుతుందని అన్నారు . లెఫ్ట్ తో పొత్తు విషయంలో అధిష్టానం చర్చలు జరుపుతుందని అన్నారు . రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ప్రజలే అంటున్నారని అన్నారు . తాను నిర్వహించిన పాదయాత్ర కాంగ్రెస్ కు బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు . ఇటీవల రాహుల్ గాంధీ బస్సు యాత్ర సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అందుకే రాహుల్ గాంధీ తెలంగాణాల కాంగ్రెస్ తుఫాన్ వస్తుందని అన్నారు . ఖమ్మం జిల్లాలో కూడా కాంగ్రెస్ క్లిన్ స్వీప్ చేస్తుందని అన్నారు .కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు .

Related posts

మిస్ యూనివర్స్‌ 2023గా నికరాగ్వా భామ.. చరిత్ర సృష్టించిన షేనిస్

Ram Narayana

నా పని ఇప్పుడే అయిపోయిందని భావించవద్దు: ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యలు

Ram Narayana

తెలంగాణలో త్వరలో బీజేపీ ప్రభుత్వం: రాజాసింగ్

Ram Narayana

Leave a Comment