Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఎంపీ వద్దిరాజుకు ఇల్లందు నియోజకవర్గంలో ఘన స్వాగతం…

ఎంపీ వద్దిరాజుకు ఇల్లందు నియోజకవర్గంలో ఘన స్వాగతం….
డోర్నకల్-బుద్ధారం గేట్ వద్ద ఎమ్మెల్యే హరిప్రియ నాయకత్వంలో ఘన స్వాగతం పలికిన గులాబీ శ్రేణులు
తిర్లాపురం ఎస్సీ కాలనీకి 20లక్షలతో రోడ్డు పనులను ప్రారంభించిన ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే హరిప్రియ
గార్ల ఏవీఆర్ ఫంక్షన్ హాలు వరకు భారీ ఊరేగింపు, మోటార్ బైకుపై చేరుకున్న ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే హరిప్రియ

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్ నాయకత్వంలో శుక్రవారం ఉదయం గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.బీఆర్ఎస్ ఇల్లందు నియోజకవర్గ ఇంఛార్జి అయిన ఎంపీ రవిచంద్రకు డోర్నకల్-బుద్ధారం రైల్వే గేట్ వద్ద ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్ఛాలిచ్చి,పూలు జల్లుతూ స్వాగతం చెప్పారు.మార్గమధ్యంలో తిర్లాపురం ఎస్సీ కాలనీకి 20లక్షలతో వేసే రోడ్డు పనులను వారు ప్రారంభించారు.ఆ తర్వాత ఎమ్మెల్యే హరిప్రియ వెనుక కూర్చోగా ఎంపీ రవిచంద్ర గార్ల వీధుల గుండా మోటార్ సైకిల్ నడుపుతూ డప్పుచప్పుళ్లు, గులాబీ శ్రేణుల హర్షధ్వానాలు, నినాదాలు మధ్య బీఆర్ఎస్ మండల శాఖ మీటింగ్ జరిగే ఏవీఆర్ ఫంక్షన్ హాల్ చేరుకున్నారు.ఎంపీ రవిచంద్ర వెంట మున్నూరుకాపు ప్రముఖులు పారా నాగేశ్వరరావు, ఆకుల గాంధీ, శీలంశెట్టి వీరభద్రం, ఆకుతోట ఆదినారాయణ తదితరులు ఉన్నారు.

Related posts

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే గుడ్ బై?

Ram Narayana

తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి సభలో 6 గ్యారంటీ పథకాలు ప్రకటించిన సోనియా….

Ram Narayana

 వైఎస్సార్, కేసీఆర్ ల ఆఫర్లను తిరస్కరించాను.. నాకు పదవులు ముఖ్యం కాదు: రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment