Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

మోత మోగిద్దాం అంటూ టీడీపీ ఇచ్చిన పిలుపుపై అంబటి రాంబాబు ఎద్దేవా!

 • స్కిల్ కేసులో జ్యుడీషియల్ రిమాండులో చంద్రబాబు 
 • చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం అంటూ టీడీపీ పిలుపు
 • విధి విచిత్రమైనదన్న అంబటి రాంబాబు
 • గతంలో కాపు ఉద్యమంలో పళ్లాలు కొట్టినవారిని బొక్కలో వేశారని వెల్లడి
 • ఇప్పుడు అవినీతి కేసులో బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్ అంటూ వ్యాఖ్యలు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతుగా రేపు రాత్రి 7 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు ‘మోత మోగిద్దాం’ కార్యాచరణకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందుబాటులో ఏది ఉంటే అది మోగించాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. 

“విధి విచిత్రమైనది! నాడు కాపు ఉద్యమంలో పళ్లాలు కొట్టినవారిని మక్కెలు విరగ్గొట్టి బొక్కలో వేశావ్! ఇప్పుడు అవినీతిలో కేసులో బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్.. వారేవా!” అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు.

అమ్మా, బ్రాహ్మణీ… ఆల్రెడీ మోత మోగించారు, ఇంకా భ్రమల్లో ఉన్నట్లున్నావు!: మంత్రి రోజా చురకలు

 • మీ మామ అడ్డగోలుగా అవినీతి మేత మేసి జైలుకెళ్తే ప్రజల మద్దతు కోరుతావా? అని ప్రశ్న
 • చంద్రబాబు మోసానికి 2019లోనే ప్రజలు మోత మోగించి, 23 సీట్లతో ఇంటికి పంపించారని ఎద్దేవా
 • మంగళగిరిలో మీ భర్తకు మోత మోగించి ఓడించారని వ్యాఖ్య
 • న్యాయవ్యవస్థకు అతీతులా? అని నిలదీత
Minister Roja satires on Nara Brahmani

పాలకుల అక్రమాలను ప్రశ్నిద్దామని, రేపు రాత్రి ఏడు గంటల నుంచి ఐదు నిమిషాల పాటు మోత మోగిద్దామంటూ పిలుపునిచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణికి మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అవినీతి చేసి జైలుకు వెళ్తే, అలాంటి అవినీతిపరుడికి ప్రజల మద్దతును కోరడం ఏమిటని ప్రశ్నించారు. మంగళగిరిలో నీ భర్త లోకేశ్‌ను ప్రజలు ఓడించారన్నారు. అయినా కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జైల్లో పెడితే మీ మామకు మద్దతుగా ఆందోళన చేస్తావా? అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

‘అమ్మ, మీ మామ అడ్డగోలుగా అవినీతి  మేత మేసి జైలుకి వెళితే మీరేమో ఆ అవినీతిపరుడుకి మద్దతుగా ప్రజలను మోత మోగించమంటారా..? ఇదెక్కడి విడ్డురం? మీ మామ మోసానికి, అవినీతికి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లోనే మోత మోగించి 23 సీట్లతో ఇంటికి పంపించారు. మీ భర్త లోకేశ్‌కు మంగళగిరిలో ఎలా మోత మోగించి ఓడించారో గుర్తులేదా..?  మీ మామ ఏమో అన్ని రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ కొడితే.. నువ్వు, నీ భర్త ముద్రగడ పోరాటాన్ని కాపీ కొట్టి పళ్ళాలు, ప్లేట్లు, బెల్లులు కొట్టమంటున్నారు.. బావుంది. మీ ఫామిలీ అంతా కాపీ కొట్టడమేనా..?

నీ మామ మీద ప్రపంచం బెంగ పెట్టుకుందని మీరంతా భ్రమల్లో ఉన్నట్లున్నారు. కానీ నారాకాసురుడు ఇన్నాళ్లకు దొరికాడని ప్రజలంతా ముందుగానే దీపావళి చేసుకుంటున్నారు. బకాసురుడిలా ప్రజల సొమ్మును దోచేసిన నీ మామ చంద్రబాబు మీద చర్యలకు కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జైల్లో పెడితే ఆయనకు మద్దతుగా ఆందోళన చేస్తావా? అంటే మీరు కోర్టుల కంటే  గొప్పోళ్లా ..? న్యాయవ్యవస్థ కంటే అతీతులా..?  కోర్టుల నిర్ణయాలకు వ్యతిరేకం అవుతుందన్న జ్ఞానం లేదా..?’ అని ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.

బ్రాహ్మణి గారూ… నా సలహా వినండి: రామ్ గోపాల్ వర్మ

 • చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం కార్యాచరణకు పిలుపునిచ్చిన బ్రాహ్మణి
 • ప్రమాదకర ప్రతిపాదనలతో మీ శక్తిని పరీక్షించుకోవద్దన్న వర్మ
 • ప్రజలు మీ సలహా పాటించకపోతే అది మీకే నష్టం అని వెల్లడి

చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం అని నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి కూడా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. 

“బ్రాహ్మణి గారూ… మీరు ఒక వర్ధమాన రాజకీయవేత్త. మీకు నేనిచ్చే చిన్న సలహా ఏంటంటే… మీరు ప్రజలపై ఎంత ప్రభావం చూపగలరు అనే అంశాన్ని పరీక్షించుకునేందుకు ఇలాంటి ప్రమాదకర ప్రతిపాదనలు చేయొద్దు. మీ ప్రతిపాదనను ఎవరూ పాటించకపోతే మీ రాజకీయ జీవితం షార్ట్ సర్క్యూట్ కు గురవుతుంది. విద్యుచ్ఛక్తి అనేది కాంతివంతంగా ఉండాలే తప్ప ఎప్పుడూ కనెక్ట్ కాకూడదు అని అయాన్ రాండ్ అన్నాడు” అంటూ వర్మ తనదైన శైలిలో ఎక్స్ లో పోస్టు చేశారు.

Related posts

150 కి పైగా సీట్లు మావే…జూన్ 9 న జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు…వైవి సుబ్బారెడ్డి!

Ram Narayana

ఢిల్లీలో ఆసక్తికర పరిణామం.. జేపీ నడ్డాతో చంద్రబాబు మాటమంతీ!

Ram Narayana

నేను జగన్ కు సహాయం చేశా… కానీ ఆయన నుంచి నేనెప్పుడూ సాయం అందుకోలేదు: రఘురామ

Ram Narayana

Leave a Comment