Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఎవరిష్టం వారిది.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై కిషన్ రెడ్డి

  • ఆయనకు మంచి అవకాశం ఇచ్చామన్న కేంద్ర మంత్రి
  • జాతీయ స్థాయిలో పదవి కట్టబెట్టామని వివరణ
  • తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్య

బీజేపీ తెలంగాణ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు రోజుల్లో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ పై బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఎవరి ఇష్టం వారిది.. ఎవరి ఆలోచనలు వారివని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ మంచి అవకాశం ఇచ్చిందని, జాతీయ స్థాయిలో పదవి కట్టబెట్టామని కిషన్ రెడ్డి చెప్పారు.

అయినా పార్టీ మారడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని వివరించారు. అయితే, వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తూ ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం కాబోదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీకి రాజీనామా చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. బీజేపీ పోటీలో లేదని వారు అనుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టేది తామేనని కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. కాగా, పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో బుధవారం కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, జనసేనతో పొత్తుపై ఈ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై తీవ్రంగా స్పందించిన లక్ష్మణ్

Laxman serious comments on Komatireddy Rajagopal resignation


మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు ఓ వైపు రక్తం చిందిస్తుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. జాతీయ నాయకత్వంలో ఆయన తమ పార్టీలో చేరారని, ఇప్పుడు నిందలు వేయడం సరికాదన్నారు. రాజగోపాల్ రెడ్డికి జాతీయస్థాయిలో పార్టీ మంచి స్థానం కల్పించిందన్నారు.

నరేంద్ర మోదీ కచ్చితంగా మూడోసారి ప్రధాని అవుతారన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీజేపీ అందరిలోనూ జాతీయ భావాన్ని పెంపొందిస్తుందన్నారు. జనసేన, బీజేపీ కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు.

కొందరు అలా వచ్చి వెళ్తుంటారు: జితేందర్ రెడ్డి

రాజగోపాల్ రెడ్డి పాసింగ్ క్లౌడ్ వంటి వారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ తెలంగాణలో ఎప్పుడూ బలంగానే ఉందని… ఉంటుందని, కానీ కొందరు నేతలు అలా వచ్చి వెళ్తుంటారన్నారు. తాను లోక్ సభకు పోటీ చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

Related posts

తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర… ఈ నెల 10న షెడ్యూల్, రూట్ మ్యాప్ ఖరారు!

Ram Narayana

ఆందోల్ నుంచి బాబుమోహన్‌కే టిక్కెట్… 35 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల…

Ram Narayana

ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు : ఎంపీ నామ

Ram Narayana

Leave a Comment