Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

కందాలకు మద్దతుగా సీఎం కేసీఆర్ పాలేరుకు…జీళ్లచెరువులో బహిరంగసభ…

కందాలకు మద్దతుగా సీఎం కేసీఆర్ పాలేరు కు…జీళ్లచెరువులో బహిరంగసభ…
భారీగా జన సమీకరణకు ఏర్పాట్లు
గులాబీ జెండా రెపరెపలు
ఉమ్మడి ఖమ్మంలో తొలి సభ ….ఏర్పాట్లను పరిశీలించిన నామ ఎమ్మెల్సీ మధు ,కందాల

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు నుంచే బిఆర్ఎస్ ఎన్నికల శంఖారావం పూరించనున్నది . పాలేరు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కూసుమంచి మండలం జీళ్ళచేర్వు గ్రామంలో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు సూర్యాపేట – ఖమ్మం రహదారి పక్కన సుమారు 25 ఎకరాల్లో స్థలంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సభ ప్రాంగణమంతా గులాబీ జెండాల రెపరెపలు ,ఫ్లెక్సీలు ,కటవుట్ లతో నిండిపోయూయింది ..సీఎం ల్యాండ్ అయ్యేందుకు పక్కనే ప్రత్యేక హెలిపాడ్ సిద్ధం చేశారు. ఇక్కడ నుంచే కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తుండడం, వైఎస్ఆర్సి టీపీ అధ్యక్షరాలు వైయస్ షర్మిల పోటీ చేస్తానని ప్రకటించడంతో పాలేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ మారిన తుమ్మల, పొంగులేటిపై ఇప్పటి వరకు ఎక్కడ ప్రస్తావించిన కేసీఆర్ శుక్రవారం జరిగే పాలేరు సభలో ఏం మాట్లాడుతారో అన్న చర్చ సాగుతోంది. మరో వైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే తొలి సభ పాలేరు కావడంతో విజయవంతం కోసం ఎమ్మెల్యే కందాల విశేష కృషి చేస్తున్నారు. కేసీఆర్ తో సాన్నిహిత్యం , ఉమ్మడి ఖమ్మం కు పాలేరు ప్రవేశ ద్వారం కావడంతో మొదటి సభ ఇక్కడ ఏర్పాటు చేసినట్లు నేతలు తెలిపారు. సభ ఏర్పాట్లను ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు , బీఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుతో కల్సి ఎమ్మెల్యే కందాల పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కందాల మాట్లాడుతూ .. గత ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలు నేనేంటే ఏమిటో చూశారు .. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని అన్నారు. ఎవరు వచ్చి అడిగిన నాకు తోచిన సహాయం చేశా.. ఇది ఎవరిని అడిగిన చెపుతారు ..నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ను ఒప్పించి రోడ్లు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. తనకు ప్రత్యర్థి ఎవరైనా తన గెలుపును అడ్డుకునే శక్తి ఎవరికి లేదన్నారు . ప్రభుత్వం కేటాయించిన గవర్నమెంట్ ఇంజినీరింగ్ కళాశాల నియోజకవర్గానికి సీఎం కేటాయించారు . నర్సింగ్ కళాశాల వచ్చింది.. మున్నేరు ప్రాంత ప్రజలు కరుణగిరి , జలగం నగర్ ప్రాంతంలో ముంపుకు గురికాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయబోతున్నామన్నారు. పాలేరు పాత కాలువ, భక్తరామదాసు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడం జరిగిందన్నారు. కేసీఆర్ సభను విజయవంతం చెయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పార్కింగ్ కోసం : ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చేసే పార్టీ కుటుంబ సభ్యులకు,అభిమానులకు వాహనాలు పార్కింగ్ ప్రదేశాలు కేటయించారు. కూసుమంచి మండలం వైపు నుంచి వచ్చే అభిమానులు అందరు ఎస్ ఎస్ ఎల్ వి వెంచర్ లో వాహనాల కోసం కేటయించారు. ఖమ్మం రూరల్,నేలకొండపల్లి,తిరుమలాయపాలేం నుంచి వచ్చే అభిమానులు అందరూ తల్లంపాడు రోడ్డు మీదగా సభ ప్రాంగణంకు 100 మీటర్ల ముందు ఉన్న పార్కింగ్ ప్రదేశంలో వాహనాలు కోసం కేటయించారు. ఇది మన సభ అందరం ఐకమత్యంతో ఉండి క్రమశిక్షణతో ఉండి సభ ను విజయవంతం చేసుకుందామని నేతలు సూచించారు.

Related posts

ఖమ్మంలో కలిసిన మంత్రులు …కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం సమిష్టి వ్యూహం దిశగా అడుగులు…

Ram Narayana

ఖమ్మం నుంచే తుమ్మల పోటీ …!

Ram Narayana

తన గెలుపును ఎవరు ఆపలేరు … పాలేరు బీఆర్ యస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి!

Ram Narayana

Leave a Comment