ఎలక్షన్ కమిషన్ వార్తలు

కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్‌పై ఎన్నికల సంఘం బదలీ వేటు

  • కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడును బదలీ చేస్తూ ఈసీ ఆదేశాలు
  • బదలీకి గల కారణాలు తెలియాల్సి ఉంది
  • మరో నెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

మరో నెల రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో… కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌పై బదలీ వేటు పడింది. కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడును బదలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని పేర్కొన్నారు. అయితే ఇందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Related posts

21 రాష్ట్రాల్లో 102 లోక్‌సభ స్థానాలకు ముగిసిన పోలింగ్‌

Ram Narayana

కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం..

Ram Narayana

పశ్చిమ బెంగాల్ … ఈవీఎంలను ఎత్తుకెళ్ళి బురద గుంటలో పడేసిన గ్రామస్తులు

Ram Narayana