Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుతెలంగాణ వార్తలు

దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి.. యశోద ఆసుపత్రికి తరలింపు…

దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి.. యశోద ఆసుపత్రికి తరలింపు
సూరంపల్లిలో ఎంపీ ప్రచారం నిర్వహిస్తుండగా రాజు అనే వ్యక్తి కత్తితో దాడి
కడుపు భాగంలో కత్తితో దాడి చేయడంతో ఆసుపత్రికి తరలింపు
రాజును పట్టుకొని చితకబాదిన బీఆర్ఎస్ కార్యకర్తలు
పోలీసుల అదుపులో నిందితుడు
ప్రభాకర్ రెడ్డికి ప్రాణాపాయం లేదని వైద్యుల వెల్లడి ..
ప్రభాకర్ రెడ్డి వైద్య పరీక్షలను స్వయంగా పర్వేక్షణించిన హరీష్ రావు
సీఎం వాకబు ….ప్రాణాపాయం లేదని చెప్పిన డాక్టర్లు

మెదక్ పార్లమెంట్ సభ్యుడు, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి ఘటన రాష్ట్రంలో సంచలనం కల్గించింది…ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నించి బీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు ..ప్రచారంలో భాగంగా ఆయన దౌలతాబాద్ మండలం లోని సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో రాజు అనే వ్యక్తి హఠాత్తుగా దూసుకు వచ్చి ఆయనపై కడుపు భాగంలో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. దాడి జరగగానే అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన రాజును పట్టుకొని చితకబాదారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు.

ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. రాజు ఎవరు? ఎందుకు దాడి చేశారు? అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు. మరోవైపు, దాడి అనంతరం ఎంపీ కొత్తను ఆయన వాహనంలోనే గజ్వేల్‌కు తరలించి అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. నారాయణఖేడ్ సభకు వెళ్తుండగా మంత్రి హరీశ్ రావుకు సమాచారం రావడంతో హుటాహుటిన బయలుదేరారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

కాగా రాజు కరచాలనం చేసేందుకు వచ్చి కత్తితో దాడి చేశాడు. నిందితుడిని మిరుదొడ్డి మండలం పెద్దప్యాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడు ఓ యూట్యూబ్ ఛానల్‌లో విలేకరిగా పని చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

రాజకీయ కుట్ర ఉందా? అన్నది దర్యాఫ్తు చేస్తాం: హరీశ్ రావు

ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిపై మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ దాడి అత్యంత గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నాయన్నారు. మెరుగైన చికిత్స కోసం ప్రభాకర్ రెడ్డిని సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. నిందితుడు కత్తితో దాడి చేయడంతో కడుపులో గాయాలైనట్లు చెప్పారు.

కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ కేడర్ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఎవరూ అధైర్యపడవద్దన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని హరీశ్ రావు అన్నారు. హత్యాయత్నం వెనుక రాజకీయ కుట్ర ఏదైనా ఉందా? అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు.

హత్యాయత్నం చేసిన నిందితుడి మీద కేసు నమోదు: పోలీస్ కమిషనర్ శ్వేత

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత తెలిపారు. ఈ దాడికి సంబంధించి విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డిపై మిరుదొడ్డి మండలంలోని చెప్యాల గ్రామానికి చెందిన 38 ఏళ్ల గడ్డం రాజు కత్తితో దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో ఎంపీకి గాయాలయ్యాయని, ఆయనకు ప్రాథమిక చికిత్స చేసి గజ్వేల్ ఆసుపత్రికి తరలించారని, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

.

Related posts

సంక్షేమ పథకాల అమలుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

ఆఫ్ఘనిస్థాన్ లో మసీదుపై ఉగ్రదాడి… 100 మంది మృతి!

Drukpadam

సిగ్నల్‌కు బురద పూసి దోపిడీకి యత్నం.. ప్రయాణికులు ఎదురు తిరగడంతో పరార్..

Ram Narayana

Leave a Comment