Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం అసెంబ్లీ పోరు …తాజా ,మాజీల మధ్య మాటల యుద్ధం ..తగ్గేదేలే అంటున్న నేతలు ..!

ఖమ్మం అసెంబ్లీ పోరు …తాజా ,మాజీల మధ్య మాటల యుద్ధం ..తగ్గేదేలే అంటున్న నేతలు ..!
అరాచకపాలన అంతానికి తనను గెలిపించాలని అంటున్న తుమ్మల
అహంకారానికి అభివృద్ధికి మధ్య ఎన్నికలంటున్న మంత్రి పువ్వాడ
తనది హ్యాట్రిక్ విజయం …కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమంటున్న మంత్రి

తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పోరు రసవత్తరంగా మారింది.ఇద్దరు ఉద్దండుల మధ్య జరుగుతున్న పోరులో ఇప్పటికే నియోజకవర్గం హీటెక్కింది…బీఆర్ యస్ నుంచి తాజా మంత్రి పోటీలో ఉండగా , కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా మాజీమంత్రి తుమ్మల బరిలో ఉండటంతో పోరు ఆసక్తిగా మారింది.. తాజా,మాజీలమధ్య జారుతున్న మాటల యుద్ధం రోజురోజుకు హీటెక్కుతోంది…ఎవరికీ వారు తనేం తీసిపోలేదనే రీతిలో విమర్శల పర్వం కొనసాగుతుంది… మాటల్లో ఇద్దరు ఇద్దరే కావడంతో తగ్గేదేలే అంటున్నారు…నువ్వు ఒక్కటంటే ..నేడు రెండు అంటా అనే రీతిలో సాగుతుంది వారి కయ్యం …

ఖమ్మంలో ఆరాచకపాలన ,కబ్జాకోరు పాలనా , రౌడీలా పాలనా,దౌర్జన్యం లేకుండా పోవాలంటే ఖాసీం రిజ్వీ పోవాలంటే , ప్రజలంతా సుఖశాంతులతో బతకాలంటే,వారు పైసాపైసా కూడబెట్టుకుని కొన్న ప్లాట్ లకు రక్షణ కావాలంటే హస్తం గుర్తుపై ఓటివేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తుమ్మల అంటున్నారు .. ఒకప్పుడు తన దగ్గరకు వచ్చే వారు మంచినీళ్లు కావాలని , చెక్ డాం కావాలని ,రోడ్ కావాలని బడి కావాలని బిల్డింగ్ కావాలని అడిగేవారని కానీ నేడు తమమీద ఉన్న కేసులు ఎత్తివేలాయని అడుగుతున్నారని అన్నారు .తప్పకుండా ఎత్తివేస్తామని అంతే కాకుండా ఎవరైతే కేసులు పెట్టారో వారిని బాధితుడి ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పే విధంగా చేస్తామని హామీ ఇస్తున్నారు… అధికారాన్ని అడ్డంపెట్టుకొని కబ్జాలు చేసి కాలేజీలు పెట్టుకొని , తాను తప్ప ఎవరు బతకకూడదని కాంట్రాక్టులు చేస్తూ వర్కులు అన్ని తానే పొంది కోట్లాది రూపాయలు సంపాదిస్తూ నీతులు వల్లించే నేతకావాలా…లేక ప్రజల మౌలిక సమస్యల పరిస్కారం కోసం కృషి చేసిన తుమ్మల కావాలా నిర్ణయించుకోవాలని అంటూ తుమ్మల చేస్తున్న ప్రసంగాలు ఆసక్తిగా మారుతున్నాయి

ప్రతిగా మంత్రి పువ్వాడ అజయ్ అభివృదికి అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో తనకు హ్యాట్రిక్ విజయం అందించడంతోపాటు ,ముచ్చటగా మూడవసారి కేసీఆర్ ను సీఎంగా చేయాలనీ పిలుపునిస్తున్నారు…తుమ్మల ఖమ్మానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు ..బూతుమాటలు ,డొల్లతనం ఖమ్మం అభివృద్ధిని పట్టించుకోని తుమ్మల అభివృద్ధి ప్రధాతనని చెప్పుకోవడం సిగ్గుచేటని అని దెప్పిపొడుస్తున్నారు..తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న తుమ్మల వందల ఎకరాలకు ఆసామి ఎలా అయ్యారని ప్రశ్నింస్తున్నారు .. కావాలా 24 గంటలు మీకు అందుబాటులో ఉండే అజయ్ కావాలా …నాటి ఖమ్మంనికి నేటి ఖమ్మంనీకి పోల్చి చూడమని సవాల్ విసురుతున్నారు ..తనకు కేసీఆర్ ఇచ్చిన మంత్రి అనే మంత్రదండాన్ని ఖమ్మం రూపురేఖలు మార్చటానికి ఉపయోగించానని అంటున్నారు . భూమి పుత్రుడు కావాలా …? లేక అప్పుడప్పుడు వచ్చే వ్యక్తి కావాలా …? ఆలోచించుకోవాలని అంటున్నారు …కేసీఆర్ ఖమ్మం నగర అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందించినందునే ఖమ్మంలో గొల్లపాడు ఛానల్ , లకారం ట్యాంక్ బండ్ ,వాకింగ్ పారడైస్ ,రోడ్లు డివైడర్లు , సెంట్రల్ లైటింగ్ ,పార్కులు, ఖమ్మం మున్నేరు వరద ముంపుకు గురికాకుండా రిటైనింగ్ వాల్ , మున్నేరు పై పాత బ్రిడ్జి పక్కన తీగల బ్రిడ్జి ఆగ్రహం రైలు బ్రిడ్జి ,ముస్తఫానగర్ , కొత్తమున్సిపాల్ కార్పొరేషన్ బిల్డింగ్ ,కొత్త బస్సు స్టాండ్ ,వెజ్ ..నాన్ వెజ్ మార్కెట్లు ఏర్పాటు, ఐటీహబ్ ఖమ్మం ప్రగతికి చిహ్నాలుగా నిలిచాయని అన్నారు. ఖమ్మం టు ఇల్లందు రోడ్ విస్తరణ లాంటి అభివృద్ధి నేను మంత్రి కాకపోతే జరిగేదా అని పువ్వాడ అంటున్నారు … ఖమ్మం మరింత అభివృద్ధి జరగాలంటే కారు గుర్తు పై వోట్ వేసి హ్యాట్రిక్ విజయం అందించాలని కోరుతున్నారు ..

ప్రచారంలో ఇరువురి అభ్యర్థులు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడంలేదు …కులాలు ,మతాలు ,ప్రాంతాలు డివిజన్లు , గ్రామాలూ , బంధాలు ,బంధుత్వాలు అన్నిటికి ఉపయోగిస్తున్నారు …ఇద్దరినీ కాదనలేని నేతలకు చిక్కు సమస్య వచ్చింది..కొందరికి ఒకరికి మద్దతు ఇస్తే మరొకరికి కోపం మనకెందుకులే అంటున్నారు ..ఖమ్మం లో ఎవరు గెలుస్తారు …తుమ్మలా…? అజయ్ నా…? అని ఉమ్మడి జిల్లాలోనే కాకుండా ,రాష్ట్రంలో ఆరాతీస్తున్నారు … దీంతో ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారాయి…

Related posts

పల్లా రాజేశ్వర్ రెడ్డికే జనగామ టికెట్..ముత్తిరెడ్డికి టీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి…! 

Ram Narayana

ఆ ముగ్గురి సారథ్యంలో తెలంగాణ బీజేపీ బస్సు యాత్ర

Ram Narayana

పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన వివేక్ వెంకటస్వామి

Ram Narayana

Leave a Comment