Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

సండ్ర విజయాన్ని కాంక్షిస్తూ కల్లూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ…

సండ్ర విజయాన్ని కాంక్షిస్తూ కల్లూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ…

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర అధ్వర్యంలో కల్లూరు లో ప్రజా ఆశీర్వాద సభ

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర అధ్వర్యంలో కల్లూరు లో ప్రజా ఆశీర్వాద సభ
ఎమ్మెల్యే తో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ బండి పార్థసారధి రెడ్డి
ఎమ్మెల్సీ ,జిల్లా అధ్యక్షుడు తాతా మధు
108 లాoటోడు ఎమ్మెల్యే: ఎమ్మెల్సీ మధు

ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంకు రానున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కల్లూరు మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ జరగనున్నది. ఈ నేపద్యంలో నియోజవర్గంలోని ఐదు మండలాల నుంచి దాదాపు లక్ష మందిని సభకు తరలించే ఏర్పాట్లు చేశారు. శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య సభా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు . సీఎం పర్యటన సందర్భంగా ఒక రోజు ముందు నుంచే సభా ప్రదేశం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నియోజవర్గంలోని ఐదు మండలాల నుంచి వచ్చే ప్రజల కోసం ఐదు గేట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో మండలానికి ఒక్కో గేటు నుంచి ప్రజలు సభా స్థలానికి వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. నియోజవర్గానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తల తరలింపులో నిమగ్నమయ్యారు. రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధు, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, 5మండలాల ఎంపీటీసీ సభ్యులు, జడ్పిటిసి సభ్యులు, ఇతర పార్టీ ప్రముఖులు సభకు హాజరు కానున్నట్లుగా తెలిపారు. వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి నుంచి వచ్చే వాహనాల కోసం కల్లూరు నుంచి సత్తుపల్లి వచ్చే మార్గంలో పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేశారు. తల్లాడ, కల్లూరు మండలాల వాహనాల కోసం తల్లాడ నుంచి కల్లూరు వచ్చే మార్గంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా పోలీస్ కమిషనర్ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ నిఘా పెంచామన్నారు. సభకు వచ్చిన ప్రజలు తిరిగి జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

108 లాoటోడు ఎమ్మెల్యే సండ్ర:

ఎవరికి ఆపద వచ్చినా ఏ సమయంలోనైనా ఆదుకునే వ్యక్తి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అని, 108 లాoటోడు అని ఎమ్మెల్సీ , ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ అన్నారు మంగళవారం సభా ప్రాంతం వద్ద ఎమ్మెల్యే తో కలిసి ఆయన మీడియా తో మాట్లాడారు. మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారని త్వరలో మరోసారి గెలిచి 4 కొడతారని తెలిపారు. ఇప్పటికే ఆయన గెలుపు ఖరారు అయిందని సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభలో ప్రజలు తాము గెలిపించుకుంటామని చెప్పేందుకే ఈ సభ ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ మధు తెలిపారు. పార్టీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చింతనపు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో రూపొందించిన వాలంటీర్ టీ షర్టులను ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ మధు ఆవిష్కరించి పంపిణీ చేశారు.

సభకు ప్రత్యేక ఏర్పాట్లు: ఆశీర్వాద సభకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక షామియాన పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత ఆయన మీడియా తో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు ఆత్మవిశ్వాసం కలిగే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఉంటుందన్నారు. ఇప్పటికే మేనిఫెస్టో లక్ష కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 1000 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. కల్లూరు డివిజన్ ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి చేశామన్నారు. దళిత బందు కింద 27,500 మందు జాబితాతో రూ . 300 కోట్లు ప్రోగ్రెస్ లో ఉందన్నారు . మీడియా సమావేశంలో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

న్యూస్ ఇన్ బ్రీఫ్ ……

Drukpadam

పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా … మంత్రి పొంగులేటి…

Ram Narayana

ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ గెలుపే మా లక్ష్యంగా పనిచేస్తున్నాం …ఎంపీ వద్దిరాజు

Ram Narayana

Leave a Comment