శాసన సభ ఎన్నికల సందర్భంలో బషీర్ బాగ్ లోని TUWJ(IJU) యూనియన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) నిర్వహించిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు ఏ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
కార్యక్రమానికి సీనియర్ సంపాదకులు కే.రామచంద్ర మూర్తి మోడరేటర్ గా వ్యవహరించగా, ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీలతో పాటు ఆయా భాషలకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల పాత్రికేయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
