ఖమ్మం వార్తలు

పాలేరు ,ఖమ్మంలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి …తుమ్మల , పొంగులేటి

పాలేరు ,ఖమ్మంలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి …తుమ్మల , పొంగులేటి
పొంగులేటి ,నేను అన్నదమ్ముల్లా పనిచేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం
బీఆర్ యస్ ది అవినీతి ఆరాచకపాలన
కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది..అందుకే బీఆర్ యస్ నేతలు కంగారు పడుతున్నారు
తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఋణం తీర్చుకోవాలని ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు .

పాలేరు ,ఖమ్మం లలో కాంగ్రెస్ జెండా ఎగరాలని కాంగ్రెస్ నేతలు ఖమ్మం , పాలేరు నియోజకవర్గ అభ్యర్థులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు . రెండు నియోజకవర్గాలు తమకు రెండు కళ్లలాంటివని తాము గెలవగానే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని అన్నారు . శనివారం పాలేరు నియోజకవర్గంలోని , నేలకొండపల్లి , కూసుమంచి బూతు కమిటీల సమావేశాల్లో ఇరువురు నేతలు పాల్గొన బీఆర్ విధానంపై ధ్వజమెత్తారు..

తుమ్మల మాట్లాడుతూ పాలేరు….ఖమ్మం నియోజకవర్గాల నేతలు అన్నదమ్మల్లా పనిచేయాలన్నారు …..నేను పొంగులేటి ఇద్దరం పార్టీ అధిష్టానం నిర్ణయం తో ఖమ్మం లో పాలేరు బరిలో ఉన్నామని చెప్పారు ………కరవు కాటకాలు ఉన్న పాలేరు
పల్లేర్లు మొలచిన పాలేరు ను అభివృద్ధి చేసామని అన్నారు …..మట్టి పిసుక్కునే నన్ను మంత్రిగా చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకం కు రుణపడి ఉంటా…నేను పొంగులేటి టీ.అర్.ఎస్ బలోపేతం చేసాం…కానీ వారే మమ్మల్ని దూరం చేసి నాశనం చేకుకున్నారు
..బీ.అర్.ఎస్ పాలనలో అవినీతి విధ్వంసం అరాచకం ఎక్కువైయ్యాయి..తెలంగాణ లో కాంగ్రెస్ అధికారం లోకి రాబోతుందని సభికుల హర్షద్వానాల మధ్య చెప్పారు …తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలి….భారత్ జోడో యాత్ర తో దేశాన్ని ఐక్యం చేసిన రాహుల్ గాంధీ నాయకత్వంలో నేను పొంగులేటి గౌరవంగా పార్టీలో చేరాం..నాకు ప్రజలు ఇచ్చిన గౌరవం… పొంగులేటి కి హాయిగా బతికే స్థోమత ఉంది….కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో మా ప్రయాణం…సర్వేల్లో కాంగ్రెస్ జయ కేతనం తో బీ.అర్.ఎస్ లో కలవరం….పాలేరు ఖమ్మం కీర్తి ప్రతిష్టలు పెరిగేలా నేను పొంగులేటి పనిచేస్తాం..

బీ.అర్.ఎస్ లో ఓటమి భయం మొదలైంది..90 సీట్లు గెలుస్తామన్న బీ.అర్.ఎస్ పెద్దల మొహం లో బెరుకు కనిపిస్తోంది…తెలంగాణ సమాజం కాంగ్రెస్ పాలన కోరుతుంది….తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలి…పాలేరు ఖమ్మం నేతలు తల ఎత్తుకుని ఉండేలా నేను పొంగులేటి పనిచేస్తాం…అవినీతి అరాచక పాలన తరమి కొట్టాలి….ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి


Related posts

భూ భారతి తో భూ సమస్యలు మొత్తం పరిష్కారం కావు…బొంతు రాంబాబు

Ram Narayana

రైతు సమస్యలే అజెండగా ప్రజల్లోకి : ఎంపీ నామ నాగేశ్వరరావు

Ram Narayana

ఖమ్మం నగరానికి నాలుగు దిక్కులా ఖబరస్థాన్ ల ఏర్పాటుకు చర్యలు… మంత్రి తుమ్మల

Ram Narayana