పాలేరు ప్రజలకే నాజీవితం అంకితం : ఎమ్మెల్యే కందాళ..
ఆజాత శత్రువు ఎమ్మెల్యే కందాళ : ఎంపీ నామ నాగేశ్వరరావు..
మా ఎమ్మెల్యే కందాళ అని చెప్పుకునేందుకు పాలేరు గర్వపడుతుంది : ఎమ్మెల్సీ తాత మధుసూధన్..
పాలేరు బిడ్డగా గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన పదవిని ప్రజలకోసం ఉపయోగించాను.. పాలేరు ప్రజలకే నాజీవితం అంకితం ..వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాను …నాచేతనైనా సహాయం చేశాను …నేను ఏమిచేశాననేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు …అందరు నావాళ్లుగా భావించాను …ప్రతిగ్రామాన్ని టచ్ చేశాను అక్కడ సమస్యలు విన్నారు .సీఎం కేసీఆర్ సహాయ సాకారాలతో ప్రతిగ్రామానికి మంచినీళ్లు , గ్రామపంచాయతి ట్రాక్టర్ , పంచాయతీ భవనం నిర్మించాం ..కల్యాణ లక్ష్మి ,షాదిముబారక్ ఇచ్చాం …లింక్ రోడ్లు ఏర్పాటు చేశాం …పాలేరు ప్రజలు మరొకసారి ఆశ్వీర్వదిస్తారనే నమ్మకం ఉంది ఎమ్మెల్యే బీఆర్ యస్ పాలేరు అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు ..శనివారం ఖమ్మంకు సమీపంలోని సాయి గణేష్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ నామ నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు ..
ఏవరెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా,ఎన్ని జగన్నాటకాలు ఆడిన నా ప్రజల నుండి నన్ను విడదీయలేరు,నమ్ముకున్న వారి కోసం శ్రమించడం నా నైజం నమ్మిన వాళ్లను వదిలి రాజకీయ అవసరాలకు వెళ్లడం ప్రత్యర్ధుల నైజం అని కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటిని ఉద్దేశించి అన్నారు …
ఆజాత శత్రువు ఎమ్మెల్యే కందాళ : ఎంపీ నామ నాగేశ్వరరావు..
ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ తన 25 ఏండ్ల రాజకీయ జీవితచరిత్ర లొ కందాళ వంటి మంచి మనస్సు ఉన్న నాయకుడు చూడలేదన్నారు .ఆయన ఆజాత శత్రువు… ఎవరికీ ఏ సమస్య వచ్చిన స్పందించే ఆయన మనస్తత్వం చాలాగొప్పదని అన్నారు . ఎలాంటి ఎమ్మెల్యే దొరకడం పాలేరు ప్రజలు చేసుకున్న అదృష్టమని కొనియాడారు..
మా ఎమ్మెల్యే కందాళ అని చెప్పుకునేందుకు పాలేరు గర్వపడుతుంది : ఎమ్మెల్సీ తాత మధుసూధన్..
మట్టిని పట్టుకుంటే ఇక్కడ బిడ్డలు కాలేరని ఆనాడే కందాళ చెప్పారని ఎప్పడు వచ్చి తగుదునమ్మా అని మాయమాటలు చెప్పి వచ్చే వాళ్ళను నమ్మవద్దని తాతా మధు అన్నారు .
నమ్మకద్రోహులు ఒకవైపు నమ్ముకున్న వారికి తన జీవితం అంకితం చేసిన నాయకుడు ఒకవైపు ఉన్నాడని పాలేరు ప్రజలు గుర్తించుకోవాలని అన్నారు ..వలసవాదులకు అవకాశ రాజకీయ నాయకులకు పాలేరు ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని మధు హెచ్చరించారు ..మీడియా సమావేశంలో పార్టీ నాయకులూ , స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు…