Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

సీఎం కేసీఅర్ పై తుమ్మల సంచలన వ్యాఖ్యలు…

సీఎం కేసీఅర్ పై తుమ్మల సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రివి దిగజారుడు మాటలు
నీకు ఫారెస్ట్ మంత్రిపదవి ఇస్తే నచ్చకపోతే ట్రాన్స్ పోర్ట్ పదవి ఇప్పించినా లేదా ..?
వెళ్లి చంద్రబాబు ను అడుగు తెలుస్తుంది..
జిల్లాలో గులాబీ జెండా కట్టేవాడు లేకపోతె బ్రతిమాలి పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చావు ..
నాకు మంత్రి పదవి ప్రజల కోసం ..సీతారామ ప్రోజక్ట్ కోసం
పువ్వాడ వయ్యారి భామ లాంటోడు…..పూజకు పనికి రాని పువ్వు
70 కోట్ల గొల్లపాడు ఛానల్ ను కమిషన్లకోసం 170 కోట్లు చేశావు
ట్యాంకర్లతో నీళ్లు నీ తండ్రి హయాంలో నేను వచ్చాకనే పర్మినెంట్ సొల్యూషన్

తుమ్మల తుప్పు …పువ్వాడ పువ్వులాంటోడన్న సీఎం కేసీఆర్ మాటలపై మాజీమంత్రి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు …ముఖ్యమంత్రి దిగజారుడు మాటలు మాట్లుడుతున్నారని మండిపడ్డారు …నేను మూలన కూర్చుంటే ఆయన మంత్రి పదవి ఇవ్వడమేమిటి …నాడు జిల్లాలో పార్టీకి జెండా కట్టేవాడు లేకపోతె నాదగ్గరకు వచ్చి బ్రతిమిలాడి పార్టీల చేర్చుకున్నావు …ఆసందర్భంగా నేను ప్రజలకోసం ప్రత్యేకించి సీతారాం ప్రాజెక్టు కోసం చేరానని చెప్పా ..? నాకు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వకముందే మూడుసార్లు మంత్రిని ..నాడు చంద్రబాబు క్యాబినెట్ లో కేసీఆర్ కు ఫారెస్ట్ మంత్రి పదవి ఇస్తే ఇష్టంలేదు ఆవిషయాన్ని చంద్రబాబుకు చెప్పి ట్రాన్స్ పోర్ట్ మంత్రిగా ఇప్పించా…ఒక వేల నువ్వు చెప్పేందుకు ఇష్టపడకపోతే చంద్రబాబును అడుగు అని అన్నారు …మళ్లీ వచ్చి సీతారామ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తానని కేసీఅర్ అంటున్నారు అంటే వాళ్ల పరిస్థితి ఏమిటో జనాలకు అర్థమవుతుంది…శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ మళ్ళీ శంకుస్థాపన ఏమిటి …?

పువ్వాడ వయ్యారి భామ లాంటోడు…..పూజకు పనికి రాని పువ్వు

పువ్వాడ అజయ్ పై సీఎం పొగడ్తలు కురిపించి తుమ్మలపై ఘాటు వ్యాఖ్యలు చెయాయడంపై కూడా తుమ్మల తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు ..పువ్వాడ వయ్యారి భామ లాంటోడు…..పూజకు పనికి రాని పువ్వుఅని దుయ్యబట్టారు … ఖమ్మం ప్రజలకు పువ్వాడ ఏమిటో కొద్దికాలంలోనే అర్ధం అయిందని అన్నారు …పువ్వాడ కమ్యూనిస్ట్ పార్టీని వైసీపీ నీ కాంగ్రెస్ నీ మోసం చేసి మా గూర్చి మాట్లాడటం సిగ్గుచేటు ఘాటు విమర్శలు చేశారు …కమీషన్ల కోసం గోళ్ళ పాడు ఛానల్ కాంట్రాక్టర్ నీ మార్చి 70 కోట్ల పని 170 కోట్లకు పెంచారని .పైన రంగుల బొమ్మలు వేసి డబ్బులు కాజేసిన చరిత్ర వారిదని అలాంటి వారు నీతులు వల్లించడం గురివింద సామెతలా ఉందని పేర్కొన్నారు ..కాంగ్రెస్ ప్రభుత్వంలో నాడు తెలుగుదేశం ఎమ్మెల్యే గా ఉన్నా ఖమ్మం మున్సిపాలిటీ నీ కార్పొరేషన్ గా మార్చా..రఘునాథ పాలెం మండలం ఏర్పాటు నేనే చేశా…..

పువ్వాడ కు తుమ్మల సవాల్

దానవాయి గూడెం ….పుట్ట కోట ,లకారం మంచినీటి పథకాలు నేను తెచ్చానో నీవు తెచ్చావో బహిరంగ చర్చ కు సిద్దమా అని సవాల్ విసిరారు …..నీ తండ్రి హయాంలో ఖమ్మం లో ట్యాంకర్లు గతి..నేను ఖమ్మం లో తాగునీటి కష్టాలు దూరం చేసి మౌలిక సదుపాయాలు కల్పించా…ఖమ్మం ప్రజానీకం కు నేనేంటో తెలుసని తుమ్మల పువ్వాడ మాటలపై కౌంటర్ ఇచ్చారు ..



….

Related posts

దేహాలు ముక్కలైనా దేశం కోసం పని చేసింది గాంధీ కుటుంబం: మంత్రి సీతక్క

Ram Narayana

పాతికేళ్లలో గుర్తుకు వచ్చే సీఎంలు ఈ ముగ్గురే… చంద్రబాబు, వైఎస్, కేసీఆర్‍: కేటీఆర్

Ram Narayana

అందుకే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాను: ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్

Ram Narayana

Leave a Comment