Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

మైక్ ముందు ఐదు నిమిషాలు మాట్లాడలేని వ్యక్తిని ఎమ్మెల్యే గా గెలిపించారు- పొంగులేటి…

మైక్ ముందు ఐదు నిమిషాలు మాట్లాడలేని వ్యక్తిని ఎమ్మెల్యే గా గెలిపించారు- పొంగులేటి…
నాకు అవకాశం కల్పిస్తే మీ సేవకుడిగా ఉంటా …
కరువు మందలను శాశ్యశ్యామలం చేశా …మాజీమంత్రి తుమ్మల
రాష్ట్రంలో అవినీతి పాలనా …తెలంగాణాలో ప్రజలు బాగుపడలేదు ..ఒక కుటుంబం బాగుపడింది.. తుమ్మల

మైక్ ముందు ఐదు నిముషాలు మాట్లాడలేని వ్యక్తిని శాసనసభ్యుడి గా మీరు గెలిపించారని … అలాంటి వ్యక్తి మిమ్మల్ని కాదని అధికారం కోసం పార్టీ మారడు. అలాంటి వ్యక్తికి అవకాశం కల్పించిన మీరు నిత్యం మీ క్షేమమే నా క్షేమంగా భావించే నాకూడా మీ సహకారం అందించాలని… మీ సహకారంతో పాలేరు నియోజకవర్గంలో గెలిచి ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని పాలేరు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ బూత్ స్థాయి సమావేశం ఎస్ ఆర్ కన్వెన్షన్ లో , తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ బూత్ సమావేశం ఓ ప్రయివేట్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు… మీరు కష్టపడి గెలిపించిన వ్యక్తి పార్టీ లోనుంచి బయటకు పోయి ఆయన అనుచరులతో మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాడని విమర్శించారు. గతంలో చేసిన తప్పును మళ్లీ పునరావృతం చేయొద్దని,మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏ ప్రలోభాలకు,ఎవరి బెదిరింపులకు భయపడొద్దు అన్నారు. త్వరలో జరగబోయే కురుక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రంలో 70 నుంచి 78 సీట్లు తో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు చేశారు. ఎన్నికల సమయం ఇంకా 23 రోజులు మాత్రమే ఉందని కార్యకర్తలు కష్టపడండి, మీ కష్టాలు తీర్చే బాధ్యతన్నదన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడయినా ఎవరు ఎదురొచ్చినా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని అన్నారు.

  • తొండ ముదిరి ఊసరవెల్లి లాగా తయారయ్యింది..
  • మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు…

ప్రస్తుతం రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తుందని,తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు కేసీఅర్ కుటుంబం అవినీతిలో ఆరితేరి పోయిందని,అది ఇపుడు శివలింగం మీద తేలులా తయారయ్యిందని మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.
ఒక నాడు కరువుతో అల్లాడిపోయిన పాలేరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాన్నారు. అంత అభివృద్ధి చేసిన నన్ను కొంత మంది దుర్మార్గులు పార్టీకీ వెన్నుపోటు పొడిచి ఓడించారన్నారు.
నాడు కాంగ్రెస్ పార్టీలో మీరు కష్టపడి గెలిపించిన ఎమ్మెల్యే కేసీఅర్ కి అమ్ముడుపోయి పార్టీకి ద్రోహం చేశాడని విమర్శించారు. నియోజకవర్గాన్ని నలుగురు సామంత రాజులకు అప్పజెప్పి వాళ్ళు చేసే అరాచకాలను ఈ ఐదేండ్లు చోద్యం చూస్టూ కూర్చున్నాడని అన్నారు. ఇంత పెద్ద సమావేశంలో తమ్మినేని కృష్ణయ్య లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని, ఆయన ఆశయాలు సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీనీ గెలిపించాలని కోరారు.‌ ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాయల నాగేశ్వరరావు, మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, రాంరెడ్డి చరణ్ రెడ్డి, మానుకొండ రాధ కిషోర్, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కళ్లెం వెంకటరెడ్డి , బెల్లం శ్రీను , రామసహాయం నరేష్ రెడ్డి, చావా శివ రామ కృష్ణ, కొప్పుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాలేరు ,ఖమ్మంలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి …తుమ్మల , పొంగులేటి

Ram Narayana

ప్రాణాలు తీసిన ఈత సరదా… తండ్రి ఎదుటే ముగ్గురు విద్యార్థులు మృతి

Ram Narayana

ఖమ్మంలో తుమ్మల వర్సెస్ పువ్వాడ నామినేషన్ లొల్లి…

Ram Narayana

Leave a Comment