Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

భట్టి మధిర నియోజకవర్గంలో జననీరాజనం …సీఎం సీఎం అంటూ నినాదాలు…

భట్టి మధిర నియోజకవర్గంలో జననీరాజనం …సీఎం సీఎం అంటూ నినాదాలు…
పూలవర్షం కురిపిస్తున్న ప్రజలు
జోరుగా హుషారుగా సాగుతున్న ప్రచారం
మూడవరోజు ఎర్రుపాలెం మండలంలో పర్యటన
బీఆర్ యస్ పాలనపై భట్టి నిప్పులు …

… మధిర నియోజకవర్గం నుంచి తిరిగి నాల్గొవసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రచారంని ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది…జనం నీరజాలు పలుకుతున్నారు ..సీఎం సీఎం అంటూ నినాదాలు పల్లెల్లో మిన్నంటుతున్నాయి ..పూలవర్షం కురిపిస్తూ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు ..జోరుగా హుషారుగా సాగుతున్న ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు .ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం గ్రామంలో భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారానికి ప్రజలు ఘనస్వాగతం పలికారు.పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు వందలాది బైక్లతో ర్యాలీ నిర్వహించి భట్టి జిందాబాద్..‌ భట్టి సీఎం అంటూ నినాదాలను హోరెత్తించారు. గత రెండు రోజులు ముదిగొండ మండలంలో సాగిన ప్రచారం మూడవరోజు ఎర్రుపాలెం మండలం సాగింది…ఈ సందర్భంగా పలుగ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి భట్టి ప్రసంగిస్తూ బీఆర్ యస్ ప్రభుత్వం పై కేసీఆర్ విధానాలపై నిప్పులు చెరుగుతున్నారు .. వివిధ గ్రామాలలో జరిగిన ఎన్నికల సభలలో ప్రజలను ఉద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజల సొమ్ము లూటీ చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ పాలనకు చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు .. ఎన్నికల్లో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఓటు అనే ఆయుధం ద్వారా కేసీఆర్ ను ఇంటికి పంపాలని అన్నారు . బిఆర్ఎస్ కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు బందు చేస్తామని భయపెట్టి ఓట్లు వేయించుకునే పరిస్థితి తెలంగాణలో లేదన్నారు .దొరల ప్రభుత్వానికి చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వం తీసుకొస్తుందని అన్నారు ….ప్రజల సంపదని దోపిడి చేసి అత్యంత అవినీతిపరులుగా మారిన బిఆర్ఎస్ పాలకులుకు తగిన బుద్ది చెప్పాలని అన్నారు . బిఆర్ఎస్ పాలకుల అవినీతి దోపిడి వల్లనే తెలంగాణ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి జరగలేదని ధ్వజమెత్తారు .. రాష్ట్ర సంపద ప్రజలందరి పంచాలన్న రాహుల్ ఆకాంక్షలు నెరవేరుస్తాం ప్రజల సంపద ప్రజలకు చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అధికారంలోకి తెచ్చుకోవాలి…రాష్ట్ర సంపద ప్రజలందరి పంచాలన్న రాహుల్ ఆకాంక్షలు నెరవేరుస్తామన్నారు …దళిత బంధు పథకం కంటే మెరుగ్గా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అభయ హస్తం పథకం తీసుకువచ్చి దళితుల అభ్యున్నతికి పాటుపడుతుందన్నారు …కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎక్కడివని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు . రాష్ట్ర రాబడి, బడ్జెట్పై ఆర్థిక లెక్కలు తెలిసిన వ్యక్తిగా చెబుతున్నాను. ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి రాష్ట్రంలో పుష్కలంగా ఆర్థిక సంపద ఉంది…ఆరు గ్యారెంటీల అమలుకు పాలకుల ఆర్థిక దోపిడిని ఆరికడితే చాలు… వాటిని అమలు చేయడం పెద్ద కష్టం కాదన్నారు ….కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి దోపిడీకి తావులేదు. చిత్తశుద్ధితో 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని భట్టి హామీ ఇచ్చారు …. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల పథకాలనే బిఆర్ఎస్ కాపీ కొట్టి మేనిఫెస్టోగా ప్రకటించింది…కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఉద్యోగాలు ఇవ్వలేదు….రైతులకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వలే,… సబ్సిడీ ఎరువులు ఇవ్వలే,… మద్దతు ధర ఇవ్వలే,… మహిళలకు పావుల వడ్డీ రుణాలు ఇవ్వలే,…. పేదలకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే తొమ్మిది రకాల నిత్యవసర సరుకులకు మంగళం పాడిందని బీఆర్ యస్ పాలన వైఫల్యాలను భట్టి తూర్పార బట్టారు …అమ్మహస్తం పథకం అటక ఎక్కించి రేషన్ దుకాణాలను బియ్యం దుకాణాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందన్నారు …మహిళలు పెళ్లీడు వచ్చేనాటికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన రెండు లక్షల పదహారువేల రూపాయల బంగారు తల్లి పథకాన్ని చంపేసి బిఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం తెచ్చి లక్ష రూపాయలు మాత్రమే ఇవ్వడం దౌర్భాగ్యం మన్నారు . కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీలను అర్హత కలిగిన ప్రతి ఇంటికి అమలు చేస్తాం 6 గ్యారంటీల అమల్లో ఎలాంటి పక్షపాతం ఉండదు. కాంగ్రెస్ కి కుంచిత మనస్తత్వం లేదు. అన్ని పార్టీల వారికి ఇస్తాం కాంగ్రెస్ అందరి ప్రభుత్వముగా ఉంటుందన్నారు ….6 గ్యారెంటీలతో పాటు రైతు, మహిళ, దళిత, గిరిజన, మైనార్టీ, బలహీన వర్గాల డిక్లరేషన్లు మేనిఫెస్టోలో పొందుపరిచి వాటిని కూడా అమలు చేస్తాం అన్నారు . మధిర నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది తప్పా… బిఆర్ఎస్ పాలనలో జరగలేదు….పది సంవత్సరాలు అవుతున్న ఎర్రుపాలెం మండలానికి బిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు ఇవ్వలేదని , ఇండ్లు కట్టించలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని కనీసం రోడ్లను వెడల్పు చేయలేదని ఇంతకన్నా దద్దమ్మ ప్రభుత్వం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు ..ఏళ్ల తరబడి వేచి చూస్తున్నా వితంతువులకు పెన్షన్లు ఇవ్వలేదని , జాలుముడి కాలువను కట్టింది కాంగ్రెస్. కట్టలేరు ప్రాజెక్టును ఆధునికరించింది కాంగ్రెస్ అని భట్టి పేర్కొన్నారు ..

Related posts

ఆంధ్రా కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే కాళేశ్వరం నిర్మాణం: కోదండరాం

Ram Narayana

హరీశ్‌రావు అలా చెప్పిన మరుక్షణం జైలులో ఉంటారు: రేవంత్‌రెడ్డి

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఇరుక్కోవడం ఖాయం…కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

Ram Narayana

Leave a Comment