Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం జిల్లాలో 35వేల దొంగఓట్లు..కేంద్ర ఎన్నికల సంఘానికి తుమ్మల ఫిర్యాదు…

ఖమ్మం జిల్లాలో 35వేల దొంగఓట్లు..కేంద్ర ఎన్నికల సంఘానికి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఫిర్యాదు…
దొంగఓట్లు తొలగించేంతవరకూ ఎన్నికలు నిలిపివేయాలి: తుమ్మల
బిఆర్ ఎస్ మంత్రి పువ్వాడతో కుమ్మక్కై కలెక్టర్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్లు దొంగ ఓట్లు చేర్చారు: తుమ్మల
ఖమ్మం జిల్లా కలెక్టర్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ లను బదిలీ చేయాలి: తుమ్మల డిమాండ్
ఖమ్మం జిల్లాలో ఇంటి నెంబర్లు లేకుండా ఓట్ల నమోదు వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లిన తుమ్మల

ఖమ్మం జిల్లాలో 35 వేల దొంగఓట్లు చేర్చారని దీనికి జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ భాద్యులని వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించి ఎక్కడ నుంచి బదిలీ చేయాలనీ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు .ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు . దొంగఓట్లు తొలగించే వరకు జిల్లాలో ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కోరారు ..అధికార పార్టీకి చెందిన మంత్రి అజయ్ తో కలక్టర్ , మున్సిపల్ కమిషనర్ కుమ్మక్కై దొంగఓట్లు చేర్చారని ఆరోపించారు . దీనిపై వివరాలతో కూడిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు ..ఇంటి నెంబర్లు కూడా లేకుండా ఓట్లు చేర్పించినప్పటికీ అధికారులు వాటిపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు .
ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 35 వేలకు పైగా ఓట్లు ఇంటి నెంబర్లు లేకుండా నమోదు చేశారని ఫిర్యాదు…నియోజకవర్గాల వారి నమోదు చేసిన దొంగ ఓట్ల వివరాలను ఈసీకి అందించిన తుమ్మల నాగేశ్వరరావు…జిల్లా కలెక్టర్ కి , సీఈఓ, ఇతర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని పేర్కొన్న తుమ్మల ఆరోపించారు …గతంలో చేసిన తొమ్మిది ఫిర్యాదుల వివరాలను కూడా ఈసీకి పంపిన తుమ్మల నాగేశ్వరరావు
ఓట్ల జాబితా తుది ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో దొంగ ఓట్లపై దృష్టి సారించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు ..ఇంటి నెంబర్లు లేకుండా నమోదు చేసిన ఓట్లను వెంటనే తొలగించాలని కోరారు . ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరిన తుమ్మల డిమాండ్ చేశారు ..జాబితాల నుంచి దొంగ ఓట్లను తొలగించిన తర్వాతనే తుది ప్రకటన విడుదల చేయాలని ఎన్నికల సంఘాన్ని తుమ్మల కోరారు ..

Related posts

అమ‌రావ‌తి మాస్టర్ ప్లాన్ అక్రమాల కేసులో.. మాజీ మంత్రి నారాయ‌ణ‌కు ముంద‌స్తు బెయిల్‌!

Drukpadam

పేపర్ లీక్ వెనక బండి సంజయ్ కుట్ర.. తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆరోపణలు

Drukpadam

పునీత్ మృతిపై రజనీకాంత్ సంతాపం.. కన్నింగ్ ఫెలో అంటూ రజనీపై విమర్శల వెల్లువ!

Drukpadam

Leave a Comment