Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

సీపీఎంకు గుండెకాయ లాంటి ఖమ్మం జిల్లాలో సీటు లేదనడం దుర్మార్గం ..తమ్మినేని

సీపీఎంకు గుండెకాయ లాంటి ఖమ్మం జిల్లాలో సీటు లేదనడం దుర్మార్గం ..తమ్మినేని
జిల్లాలో పార్టీ ప్రభావం తగ్గలేదు ..
పార్టీని నిలబెట్టుకోవాలంటే పోటీతప్పనిసరి అని పార్టీ భావించింది ..
కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత టైం ఇచ్చాం …వారి నుంచి స్పందన రాలేదు
అందుకే పార్టీ నిర్ణయం మేరకు అభ్యర్థులను ప్రకటించాం ….
కాంగ్రెస్ పార్టీతో చర్చలు ఇక ఉండవు …

రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ బలానికి తగ్గట్లుగా కాంగ్రెస్ పార్టీ సీట్లను కేటాయించేందుకు నిరాకరించిందని …ప్రత్యేకంగా ఉద్యమానికి గుండెకాయ లాంటి ఖమ్మం జిల్లాలో సీటు లేకుండా పొత్తు అనడం దుర్మార్గమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు ..మంగళవారం సిపిఎం ఖమ్మం జిల్లా కార్యాలయం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ప్రభావానికి తగ్గట్లుగా సీట్లు కేటాయించకుండా పొత్తు అనే మాటకు అర్ధం లేదని స్పష్టం చేశారు ..పార్టీని నిలబెట్టుకోవాలంటే పోటీతప్పనిసరి అని పార్టీ భావించిందని అన్నారు .తమ టైం పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ వారి నుంచి స్పందన రాలేదని తాము సీట్లు ప్రకటించిన తర్వాత జానారెడ్డి భట్టి విక్రమార్క లు ఫోన్ చేసి తొందరపడొద్దని కోరారని అన్నారు ..అప్పటికే నిర్ణయం జరిగిపోయిందని అయినప్పటికీ పార్టీ ఆన్ లైన్ మీటింగ్ పెట్టి చర్చించాం ..తర్వాత అభ్యర్థులను కూడా ప్రకటించామని వివరించారు …అందువల్ల పొత్తులపై కాంగ్రెస్ తో పొత్తుల గురించి చర్చలు ఉండవని తేల్చి చెప్పారు ..

19 స్థానాల్లో సిపిఎం పోటీ …

గతంలో ప్రకటించిన 16 స్థానాల తోపాటు మరో మూడు నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను తమ్మినేని ప్రకటించారు .. వాటిలో కోదాడ, మునుగోడు, ఇల్లందు ఉన్నాయి…
కోదాడ నుంచి మట్టిపల్లి సైదులు… మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి… ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణ పోటీ చేయనున్నారని అన్నారు … తమ్మినేని పాలేరు నుంచి పోటీచేయనుండగా ,మిర్యాలగూడెం నుంచి జూలకంటి రంగారెడ్డి పోటీచేయనున్నారు…

Related posts

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక… వారి కుటుంబం మాత్రమే బాగుపడింది: రేవంత్ రెడ్డి

Ram Narayana

బుజ్జగింపుల పర్వం.. రాజయ్య ఇంటికి బీఆర్ఎస్ నేత దాస్యం

Ram Narayana

నిజాం చెర విడిపించేందుకు ఎందరో అమరులయ్యారు.. అమిత్ షా

Ram Narayana

Leave a Comment