Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసుల సోదాలపై మండిపడుతున్న కాంగ్రెస్ శ్రేణులు…

తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసుల సోదాలపై మండిపడుతున్న కాంగ్రెస్ శ్రేణులు…
పువ్వాడ అజయ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తుమ్మల ధ్వజం …
ఓటమికి ఖాయమని తెలుసుకొని కుప్పిగంతులు
కేసీఆర్ నే నాముందు బచ్చా…ఇక నువ్వుంత
నా ఇంటిపైకి పోలీసులను పంపుతారా …?
ప్రచారం కోసం తుమ్మల వెళ్లిన తర్వాత ఇంట్లోకి వచ్చిన పోలీసులు
ఆ సమయంలో ఇంట్లో ఉన్న తుమ్మల భార్య

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి మాజీమంత్రి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ఖమ్మం రూరల్ మండలం శ్రీ సిటీతోపాటు , అర్బన్ మండలంలోని గొల్లగూడెం ఇండ్లలో సోదాలు జరిగాయి . పోలీసులతో పాటు కొందరు రెవెన్యూ అధికారులు కూడా సోదాల్లో పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీసిటీలోని తుమ్మల నివాసంలో ఈ సోదాలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఈ ఉదయం తుమ్మల తన నివాసం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన తర్వాత పోలీసులు తుమ్మల ఇంట్లోకి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో తుమ్మల భార్యతో పాటు కొందరు అనుచరులు ఉన్నారు. తన నివాసంలో సోదాలపై తుమ్మలతోపాటు
కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.ఇవి స్థానిక మంత్రి చేయించే చిల్లర రాజకీయలాగా అభివర్ణిస్తున్నాయి.. బీఆర్ఎస్ పార్టీపైన పువ్వాడపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టేందుకే పువ్వాడ అజయ్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబడుతున్నాయి.తుమ్మల ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బులు,ఓటర్లను ప్రలోభపెట్టే వస్తువులు ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు తుమ్మల ఇంట్లో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు …అయితే ఎలాంటి డబ్బు ,ఇతర వస్తువుల లభించలేదని సమాచారం …


తనపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తుమ్మల హెచ్చరించారు . మంత్రి పువ్వాడకు ఓటమి ఖారారైందని ఎక్కడకు వెళ్లిన తుమ్మల ..తుమ్మల అంటుండటంతో తట్టుకోలేక అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు . దిక్కుతోచక పోలిసులను సైతం వాడుకుంటున్నాడని విమర్శించారు .కేసిఆర్ లాంటోడే నా ముందు బచ్చా .. ఇక నా ముందు మంత్రి అజయ్ ఎంత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ….ఓటమి ఖాయమైన మంత్రి అజయ్ తన డిపాజిట్ కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడని దెప్పిపొడిచారు . ఇలాంటి ఎన్ని చిల్లర పనులు చేసిన తుమ్మలను కాదు కదా తుమ్మలతో ఉన్న కార్యకర్త కూడా బెదరడని గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు .

మంత్రి పువ్వాడ వచ్చాకా ఖమ్మంలో ప్రజాస్వామ్య మంటగలిచిందని పోలీస్ కేసులు ,భూకబ్జాలు , దౌర్జన్యాలు ,రౌడీయిజం పెరిగిందని ప్రజలు భయంతో బతుకుతున్నారని అందువల్ల ఈ ఎన్నికల్లో పువ్వాడ అజయ్ ని చిత్తుచిత్తుగా ఓడిస్తే తప్ప తిరిగి ప్రశాంత ఖమ్మం చూడలేమని అన్నారు ..తనపైకి పైకి పోలిసులను పంపిన మరకను చెరుపుకోవడం కోసం మంత్రి అజయ్ తన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించుకునే అవకాశం ఉందని తుమ్మల అన్నారు .

Related posts

టీయూడబ్ల్యూజే (ఐజేయూ )కృషి ఫలితం …జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ..

Ram Narayana

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పర్వేక్షించాలి …మంత్రి పొంగులేటి

Ram Narayana

పాలేరు ఎమ్మెల్యే కందాల, పోలీసుల తీరుపై సీఎల్పీ నేత భట్టి ఫైర్ …

Drukpadam

Leave a Comment