Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీజేపీ ,బీఆర్ యస్ కుమ్మక్కు రాజకీయాలు…నాపై ఐటీ దాడులుజరిపే అవకాశం ….

బీజేపీ ,బీఆర్ యస్ కుమ్మక్కు రాజకీయాలు…నాపై ఐటీ దాడులుజరిపే అవకాశం ..పొంగులేటి!
కేంద్ర దర్యాప్తు సంస్థలను దాడులకు భయపడను
కాంగ్రెస్‌లో చేరడానికి ముందే ఐటీ దాడులు వంటి ఇబ్బందులు ఊహించా!
తనపైనా, తన కుటుంబంపైనా ఐటీ దాడులకు అవకాశముందన్న పొంగులేటి
కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగవచ్చునని అనుమానం
ఎన్నికల వరకు కాంగ్రెస్ నాయకులకు ఈ ఇబ్బందులు తప్పవన్న కాంగ్రెస్ నేత
కాళేశ్వరంపై కేంద్ర సంస్థ నివేదిక ఇచ్చినా ఇంకా చర్యలు తీసుకోలేదని వ్యాఖ్య

తనపైనా, తన కుటుంబం పైనా ఐటీ దాడులకు అవకాశముందని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై ఐటీ సోదాలు జరగవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై తనపై ఐటీ దాడులకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇలాంటి ఇబ్బందులు తప్పవన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే ఈ పార్టీలో చేరితే బీజేపీ లేదా బీఆర్ఎస్ ఇబ్బంది పెడుతుందని ఉహించానన్నారు.

కేసీఆర్ అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు లీకులు వెంటాడుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాల గురించి కేంద్ర సంస్థలు నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పాలేరు లో తనను రేవంత్ రెడ్డిని ఓడించేందుకు కేసీఆర్ డబ్బుసంచులు పంపిస్తున్నారని ఆరోపించారు . ప్రజల అభిమానం ముందు డబ్బుసంచులు పనిచేయవని గుర్తుంచుకోవాలని అన్నారు ..

పాలేరు పౌరుషానికి …కేసీఆర్ దురహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధం ..

పాలేరు లో తన గెలుపు ఖాయమని …ప్రజల నుంచి మంచి స్పందన ఉందని పొంగులేటి అన్నారు .పాలేరు లో జరుగుతున్నది ఆత్మగౌరవపోరాటమని అన్నారు . పాలేరు ప్రజల పౌరుషానికి …కేసీఆర్ దురహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రజల గెలుపు ఖాయమని అన్నారు . కేవలం ఎన్నికల కోసమే నేను తిరిగడంలేదని అంతకు ముందు కూడా నిరంతరం తిరిగిన విషయాన్నీ గుర్తు చేశారు …ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని కాంగ్రెస్ ను గెలిపించాలని పట్టుదలతో ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు . కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు . జిల్లాలో 10 కి 10 అసెంబ్లీ సీట్లు గెలవబోతున్నామని అన్నారు . బీఆర్ యస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు . కాంగ్రెస్ పార్టీ గ్యాస్ బండ రూ 500 లకు ఇస్తామని అన్న తర్వాత బీఆర్ యస్ రూ 400 లకే ఇస్తామని ప్రకటించిందని ఇప్పటివరకు అధికారంలో ఉన్నది వారే కదా మరి 400 రూపాలయాలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు …

కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్ హౌస్ కే పరిమితం చేయడం ఖాయం …

బంగారు తెలంగాణ అని మాయమాటలు చెపుతూ అప్పుల తెలంగాణ చేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలనీ ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నారని పొంగులేటి అభిప్రాయపడ్డారు ..బీఆర్ యస్ పార్టీలోనే కేసీఆర్ కుటుంబపాలన పై అసంతృప్తి ఉందని ,పేరుకే మంత్రులు అధికారం అంతా ఆ నలుగురి చేతుల్లోనే ఉందని విమర్శలు గుప్పించారు . ఇక వారి మాయమాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఈ ఎన్నికల్లో బీఆర్ యస్ ఓటమి ఖాయమని అన్నారు …

Related posts

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనంలో బీఆర్ యస్ కొట్టుకొని పోవడం ఖాయం..పొంగులేటి,తుమ్మల ,సిపిఐ నారాయణ …

Ram Narayana

నెగ్గిన పట్నం పంతం …మంత్రిగా ప్రమాణస్వీకారం …

Ram Narayana

బీఆర్ ఎస్ కు బిగ్ షాక్ ….6 గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి!

Ram Narayana

Leave a Comment