పాలేరు లో పొంగులేటి ,తమ్మినేని హాట్టహాసంగా నామినేషన్లు …
ఐటీ దాడుల నేపథ్యంలో పొంగులేటి నామినేషన్ పై అనుమానాలు
ప్రజా వత్తిడి తట్టుకోలేక అనుమతి ఇచ్చిన ఐటీ అధికారులు
10 .30 గంటలకు బయటకు వచ్చిన పొంగులేటి అక్కడ నుంచి నామినేషన్ కార్యక్రమానికి
పెవిలిన్ గ్రౌండ్ లో సభ ..అనంతరం ఖమ్మం రూరల్ కార్యాలయంలో నామినేషన్
వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు …
నామినేషన్లకు ఇక ఒక్కరోజే గడువు ఉండటంతో గురువారం రోజున నామినేషన్లు జోరందుకున్నాయి ..ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేయగా , సిపిఎం అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం నామినేషన్ వేశారు .. పొంగులేటి ఇంటిపై ,సంస్థలపై , బంధువుల ఇళ్లపై ఏకకాలంలో 30 చోట్లకు పైగా దాడులు జరగటం ఎన్నికల్లో పొంగులేటి నామినేషన్ కు ముహర్తం నిర్ణయించుకోవడంతో ఐటీ అధికారులు ఆయన నామినేషన్ వేసేందుకు అనుమతించారు …దీంతో ఆయన 10 .30 గంటలకు బయటకు వచ్చి వేలాదిమందితో ప్రదర్శనగా వెళ్లి నామినేషన్ వేశారు ..ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు , సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ,రామసహాయం నరేష్ రెడ్డి పాల్గొన్నారు …
మరో పక్క సిపిఎం అభ్యర్థిగా పాలేరు నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముందు ఖమ్మం సిపిఎం అభ్యర్థి యర్రా శ్రీకాంత్ తో కల్సి పెవిలియన్ గ్రౌండ్ లో సభ అనంతరం ప్రదర్శనగా వెళ్లి నామినేషన్లు వేశారు .. తమ్మినేని నామినేషన్ కార్యక్రమంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి .వెంకట్ , రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన్ , సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు రావుసిద్దినేని కోటయ్య తదితరులు పాల్గొన్నారు ..