Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

రెప్పతో పాటు కంటిని సమూలంగా మార్చిన వైద్యులు

  • సంక్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించిన న్యూయార్క్ వైద్యులు
  • హైవోల్టేజీ తీగలు తాకి కన్ను కోల్పోయిన వ్యక్తికి శస్త్రచికిత్స
  • చూపు వచ్చేది, లేనిది త్వరలోనే వెల్లడి
Newyork Doctors changed the eye including the eyelid with surgery

ప్రపంచంలోనే తొలిసారి అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా ఓ వ్యక్తి కంటిని సమూలంగా మార్చివేశారు. న్యూయార్క్‌‌లోని లాంగోన్‌హెల్త్‌ హాస్పిటల్ వైద్యులు ఈ ఘనత సాధించారు. ఓ ప్రమాదంలో కోల్పోయిన కుడి కంటిని రెప్పతో సహా సంపూర్ణంగా మార్చాలని, తద్వారా ముఖానికి కొత్తరూపు ఇవ్వొచ్చని ఈ చికిత్స నిర్వహించారు. భావించిన విధంగానే మే నెలలో ఏకంగా 21 గంటలు శ్రమించి శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ కొత్త కన్ను ఆరోగ్యంగానే ఉందని ఈ మేరకు వైద్యులు గురువారం ప్రకటన చేశారు.

కన్నును మూసి, తెరవడం సాధ్యం కాకపోయినప్పటికీ కంటిపై స్పర్శ మాత్రం తెలుస్తోందని పేషెంట్ ఆరన్ జేమ్స్‌ చెప్పారు. అయితే ఆ కన్ను ద్వారా అతడికి చూపు వస్తుందా? లేదా? అనేది త్వరలోనే తెలియనుంది. అంధత్వాన్ని, దృష్టి లోపాలను సరిచేయడానికి కార్నియా మార్పిడి వంటి శస్త్రచికిత్సలు ఎన్ని చేస్తున్నా ఏకంగా పూర్తిగా కన్నును మార్చడం వైద్యుల సరికొత్త ఘనత చెప్పాలి. ఈ శస్త్రచికిత్స భవిష్యత్తులో ఎన్నో నూతన ప్రయోగాలకు నాంది పలుకుతుందని వైద్యులు ఆకాంక్షించారు. కాగా కంటి మార్పిడి చేయించుకున్న ఆరన్ జేమ్స్ ప్రమాదవశాత్తూ హైవోల్టేజీ విద్యుత్ తీగలను తాకాడు. ఈ ఘటనలో అతడి ముఖంలో అధిక భాగం కాలిపోయింది. కుడి కన్ను పూర్తిగా పోయింది. అందుకే వైద్యులు ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది.

Related posts

యూట్యూబర్ కు నాలుగు నిమిషాల్లో ఓకే చెప్పిన సత్య నాదెళ్ల!

Ram Narayana

తైవాన్‌ భూకంప సమయంలో కనిపించకుండా పోయిన భారతీయుల క్షేమం

Ram Narayana

భారత సంతతి వ్యక్తిని కాల్చి చంపిన అమెరికా పోలీసులు…

Ram Narayana

Leave a Comment