Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రికెట్ వన్ డే వరల్డ్ కప్

ఏబీ డివిలియర్స్ రికార్డు బద్దలుకొట్టిన రోహిత్ శర్మ

  • ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక  సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్
  • నెదర్లాండ్స్‌పై 7వ ఓవర్‌లో సిక్సర్‌‌తో 2023లో 59 సిక్సర్లు పూర్తి
  • 58 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్న డివిలియర్స్‌ను వెనక్కి నెట్టిన హిట్‌మ్యాన్

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును బద్దలుకొట్టాడు. ప్రస్తుత ఏడాది 2023లో ఏకంగా 59 సిక్సర్లు కొట్టడం ద్వారా ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. దీంతో ఇన్నాళ్లు 58 సిక్సర్లతో మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ను రోహిత్ అధిగమించాడు. బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌ 7వ ఓవర్‌లో ఆఫ్ స్పిన్నర్ కోలిన్ అకెర్‌మాన్‌ బౌలింగ్‌లో లాంగ్-ఆన్ స్టాండ్స్‌లోకి సిక్స్ ద్వారా హిట్‌మ్యాన్ ఈ రికార్డు సాధించాడు. దక్షిణాఫ్రికాపై మ్యాచ్ లో డివిలియర్స్ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ… నేడు నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌లో రికార్డు బద్దలుకొట్టాడు. కాగా 2015లో ఏబీ డివిలియర్స్ 18 ఇన్నింగ్స్‌ ఆడి 58 సిక్సర్లు కొట్టాడు. ఆ రికార్డును రోహిత్ శర్మ తాజాగా చెరిపివేశాడు. అయితే రోహిత్ శర్మ 24 ఇన్నింగ్స్‌లో 59 సిక్సర్లు బాదాడు.

కాగా.. ఒక ఏడాది అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మూడవ స్థానంలో ఉన్న వెస్టిండీస్ దిగ్గజం క్రిస్‌గేల్ 2019లో 15 ఇన్నింగ్స్‌లోనే 56 సిక్సర్లు కొట్టాడు. 4వ స్థానంలో ఉన్న పాకిస్థాన్ దిగ్గజం షాహిద్ అఫ్రీది 2002లో 36 ఇన్నింగ్స్‌లో 48 సిక్సర్లు బాదాడు. కాగా నెదర్లాండ్స్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి భారత్‌కు చక్కటి ఆరంభాన్ని అందించాడు. దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. 54 బంతుల్లోనే 61 పరుగులు కొట్టి ఔటయ్యాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

Related posts

 పోరాడి ఓడిన సఫారీలు… వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఆసీస్

Ram Narayana

సీఎం రేసునుంచి తప్పుకున్న ఎకనాథ్ షిండే …ఫడ్నవిస్ కు లైన్ క్లియర్ …

Ram Narayana

అందుకే కదా.. షమీకి జేజేలు పడుతున్నది!

Ram Narayana

Leave a Comment