Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మంలో తుమ్మల వర్సెస్ పువ్వాడ నామినేషన్ లొల్లి…

ఖమ్మంలో బీఆర్ యస్ అభ్యర్థి పువ్వాడ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నామినేషన్ వేయలేదని ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు ..నామినేషన్ పత్రంలో 8 కాలాలు ఉండగా అజయ్ 6 కాలాలు మాత్రమే నింపి మిగతా రెండు కాలాలు కావాలని వదిలేశారని అది ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధలను విరుద్ధమని తుమ్మల ఖమ్మం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతోపాటు ,జిల్లా కలెక్టర్ కు , రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు … ఆ నామినేషన్ తిరస్కరించాలని కోరారు … అయితే రిటర్నింగ్ అధికారి బీఆర్ యస్ అభ్యర్థి ఇచ్చిన దాంట్లో తప్పేమీలేదని దాన్ని ఆమోదిస్తున్నట్లు చెప్పారు .దానిపై తుమ్మల తన అభ్యంతరాన్ని వ్రాత పూర్వకంగా ఇవ్వలని కోరారు ..దీనిపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు ..ఢిల్లీలో గల కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు ..దీనిపై పువ్వాడ భగ్గుమన్నారు …

తుమ్మల చేసేవి అన్ని ఇలాగానే ఉంటాయని ఆయనది అధర్మ పోరాటమని తనది ధర్మ పోరాటమని అన్నారు .2014 లో కూడా తనపై ఓడిపోయిన తుమ్మల కోర్ట్ కు వెళ్లారని ఇలా దొడ్డిదార్లు కాకుండా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని సవాల్ విసిరారు…ఖమ్మం బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పువ్వాడ మాట్లాడుతూ ..ఖమ్మంలో పాత రుగ్మతలు ఇంకా కంటిన్యూ అవుతునే ఉన్నాయని విమర్శించారు …తుమ్మల నాగేశ్వర రావుకు అధర్మం పోరాటం బాగా అలవాటు.. నా నామినేషన్ ను తిరస్కరించాలని తుమ్మల పిర్యాదు చేశారు….తుమ్మల పిర్యాదు కు ఎన్నికల అధికారులు సమాధానం ఇచ్చారు.. ఆఫీడవిట్ లో అన్ని సరిగ్గా పొందుపరచినా అయన చెప్పగానే రిటర్నింగ్ ఆఫిసర్ రద్దు చేస్తారా…అయన చెప్పినట్టు చేస్తే మంచోళ్ళు, చెయ్యకపోతే చెడ్డోళ్ళు….తప్పులు ఉంటే నోటీస్ ఇస్తారు… నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు.. ఇవ్వలేదు అంటే నా నామినేషన్ సరైంది అనే గా.. నామినేషన్ దాఖలు చేసేటపుడు అక్కడ అందరూ ఉన్నారు….రిటర్నింగ్ అధికారితో పాటు ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ నా నామినేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. తప్పుడు అఫిడవిట్ ఇస్తే ఆమోదించడానికి వాల్లేమన్న నా చుట్టాలా ఏమిటి అన్నారు …

తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే నాకు ఉదయం 10.30 గంటలకే నోటీస్ ఇచ్చేవారు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయి అని అధికారులు సమాధానం ఇచ్చారు….డిపెండెన్స్ లేనప్పుడు ఎందుకు పెట్టాలి. 2018 లో చూపించా.. ఇపుడు నా కుమారుడు డిపెండెంట్ కాదు….గతంలో నా కుమారుడుకి పెళ్లి జరగలేదు, ఇప్పుడు పెళ్లి అయ్యింది. వాడికి జీతం వస్తుంది.. పెళ్ళి అయింది. ఇప్పుడు డిపెండెంట్ కాదు కాబట్టి చూపించలేదు….అఫిడవిట్ అనేది ఆస్తులు, లావాదేవీలు ఉంటే చూపించాలి…. సమగ్ర సమాచారం తెలియచెప్పేలి… మరి ఆలా అయితే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు చోట్ల నామినేషన్ వేశారు. కొడంగల్ లో అతను నామినేషన్ వేసిన సెట్ లో ఏడు కాలాలు ఉన్నాయి. ఈసీ ఫార్మాట్ ప్రకారం లేదు….మీరు చెప్పేనట్టుగా చెయ్యాలి అంటే ముందుగా రేవంత్ రెడ్డి నామినేషన్ రద్దు చెయ్యాల్సి ఉంటుందన్నారు …

రిటర్నింగ్ ఆఫీస్ తప్పు చేస్తే కోర్టు వెళ్లొచ్చు కానీ బెదిరించడం ఏంటి….మీకు సలహా ఇచ్చింది ఎవరో.. మీ సమయం, నా సమయం వృధా చేయడం తప్ప ఏమైన పనికొచ్చేది ఉందా….అధర్మం పోరాటం కాదు ధర్మం పోరాటం చెయ్యాలి అని తుమ్మలకు నా సలహా..
అబద్దపు ప్రచారం చెయ్యకండి, మీ నలభై రాజకీయ జీవితానికి మచ్చలా మిగిలిపోతుంది. గడచిన ఇన్నేళ్ల పాటు మీరు చేసింది ఇదే….ఓటమిని తట్టుకోలేక ఇలా చేస్తున్నావ్. దమ్ముంటే ధర్మ పోరాటం చెయ్యాలి.. వెన్ను పోటు రాజకీయాలు ఎందుకు మీకు మర్యాద అనిపించుకోదు….ఎన్నికల్లో ధైర్యంగా పోరాటం చెయ్యాలి, పిరికోడు మాత్రమే ఎన్నుపోటు పొడుస్తారు….గతంలో నా మీద కేసు వేసి ఓటమి పాలయ్యారు….హందాతనంగా ఉండాలి, ఇప్పటికే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు….ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడు చూడలేదు, ఇది మా కర్మ అనుకుంటున్నాము….నీను అభ్యర్థిగా ఉన్న, అధికారంలో లేను. నేను ఖమ్మం లో చేసిన అభివృద్దిని ప్రజలకు చెప్పుకుని ఓట్లు అడుగుతున్నా..మీరు కూడా మీరు ఎం చేశారో.. ఎం చేస్తారో చెప్పి ఓట్లు అడగండి…నన్ను ఎదుర్కొలేకనే నా నామినేషన్ తిరస్కరించాలి అనడం హాస్యాస్పదం….ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి కూడా గతంలో జరిగిన విధంగానే జరగబోతుందని పువ్వాడ విశ్వాసం వ్యక్తం చేశారు ..

Related posts

ఖమ్మం ఎంపీ ఎన్నిక … కాంగ్రెస్ ,బీఆర్ యస్ నువ్వా నేనా …

Ram Narayana

జిల్లాలో మంత్రులు ,తుమ్మల , పొంగులేటి పర్యటనలు

Ram Narayana

మంత్రి తుమ్మల ముందుచూపు … ఖమ్మంకు మహర్దశ…

Ram Narayana

Leave a Comment