తెలంగాణ వార్తలు

సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లపై ఐటీ దాడులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకెన్నో రోజులు లేవు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ లో ఐటీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఉదయం నుంచి నగరంలోని పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 15 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సారి దాడుల్లో ఫార్మా కంపెనీలను ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై కూడా ఐటీ దాడులు జరిగాయి. వారం క్రితం తుమ్మల నాగేశ్వరరావు, జానారెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, కేఎల్ఆర్ నివాసాలపై కూడా ఐటీ దాడులు జరిగాయి. తాజాగా సబిన బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపుతున్నాయి.

Related posts

రాష్ట్రంలో అప్పులపై బీఆర్ యస్ ది తప్పుడు ప్రచారం ..డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

Ram Narayana

తెలంగాణలో పరీక్షల మధ్యలోనూ స్పెషల్ క్లాసులు.. టెన్త్ విద్యార్థులపై విద్యాశాఖ కొత్త ప్లాన్!

Ram Narayana

గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై, రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి

Ram Narayana