Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీలో రేపటి నుంచే కులగణన

  • ప్రయోగాత్మకంగా రెండు రోజుల పాటు నిర్వహణ
  • కలెక్టర్ల పర్యవేక్షణలో 5 ప్రాంతాల్లో చేపట్టనున్న అధికారులు
  • ఐదు పట్టణాలలో ప్రాంతీయ సదస్సులు

ఆంధ్రప్రదేశ్ లో కులగణన దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి రాష్ట్రంలో రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా కులగణన చేపట్టనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. బుధవారం నుంచి జిల్లా స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఐదు పట్టణాలలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ప్రజాభిప్రాయం మేరకు ఈ నెలాఖరు నుంచి పూర్తిస్థాయిలో కులగణన చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలు, 20న విశాఖపట్నం, విజయవాడ, 24న తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

Related posts

తూర్పు గోదావరి జిల్లాలో కింగ్ కోబ్రా కలకలం… ఎంత పెద్దదో!

Drukpadam

తాజ్ మహల్ పై కొత్త గొడవ …

Drukpadam

What You May Have Missed at the Alley 33 Fashion Event

Drukpadam

Leave a Comment