Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

బీ.అర్.ఎస్ పార్టీకి షాక్… డిప్యూటీ మేయర్ ఫాతిమా దంపతులు బీఆర్ యస్ కు బై… కాంగ్రెస్ కు జై ..

ఖమ్మం అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. పార్టీలు మారుతున్న వారు రోజురోజుకు పెరుగుతున్నారు ..నేడు ఖమ్మం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఫాతిమా,ముక్తార్ దంపతులు బీఆర్ యస్ గుడ్ బై చెప్పి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం సంచలనంగా మారింది …తుమ్మల క్యాంపు కార్యాలయంలో తుమ్మల డిప్యూటీ మేయర్ ఫాతిమా బేగం , ముక్తార్ దంపతలుకు కాంగ్రెస్ కండువా కప్పగా వారు లాంఛనంగా పార్టీలో చేరారు …

ఈసందర్భంగా మాజీమంత్రి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం లో అరాచకపాలన సాగుతుందని బెదిరింపులు …అక్రమకేసులు , నిత్యకృత్యమైయ్యాయని తన ప్రత్యర్థి బీఆర్ యస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ పై విమర్శల వర్షం గుప్పించారు …వారి అరాచక అక్రమ పాలనను విసుగు చెందిన అనేక మంది ఖమ్మం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకునేందుకు సిద్దపడుతున్నారని అందులో భాగంగానే డిప్యూటీ మేయర్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషకరమని అన్నారు . మీరు చేరిన తర్వాత మీకు మంచి పనిచేశారని అనేకమంది అభినందిస్తారని అన్నారు .ముందుగా చేరిన ముగ్గురు కార్పొరేటర్లు కు నాపక్కనే ఉండగా ఫోన్లు వస్తుంటే పార్టీ ఎందుకు మారారని అడిగేందుకు వస్తున్నాయని అనుకున్నానని అయితే వారిని మంచి పనిచేశారుగాని అభినందించిన వారు ఎక్కువగా ఉన్నారని అన్నారు .వారు గెలిచినప్పుడు కూడా ఇంత ఆనందం పొంది ఉండలేదని తుమ్మల అన్నారు . తాను పార్టీలో చేరినప్పుడు కూడా కాంగ్రెస్ లోని కింద కార్యకర్త నుంచి పై కాంగ్రెస్ అధిష్టానం వరకు అందరు అక్కున చేర్చుకున్నారని అన్నారు .

ఖమ్మంలో సదరు నేత తానే ఒక నియంతలా వ్యవరిస్తూ గుడిని గుడిలో లింగాన్ని మింగే బాపతుగా తయారయ్యాడని ధ్వజమెత్తారు ..ప్రజా ప్రతినిధులైన కార్పొరేటర్లను పీడించి, అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు…వారి వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టినరోజు యాడ్ ఇవ్వలేదని బండబూతులు తిట్టడమా…ఇదిమి అరాచకం …ఎక్కడైనా ఉందా….అని విమర్శించారు …అతని పోకడలు ,విధానాలు నచ్చక అనేక మంది కుమిలి పోతున్నారని అందుకే గెలిపించిన ప్రజల అభీష్టం మేరకే కార్పొరేటర్లు బి ఆర్ ఎస్ పార్టీ ని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తుమ్మల అన్నారు .ఖమ్మం లో అరాచక అవినీతి పాలన తరిమికొట్టాలి… ఇప్పుడు ఉన్నవాళ్లు అంత అప్పుడు టి ఆర్ ఎస్ నుండే గెలిచారు…
నేను ఏ రోజు ఒక్కసారి మేయర్ కి కూడా ఫోన్ చెయ్యలేదు…ఇలా అసభ్య భాషను ఎప్పుడు వాడలేదు…అవినీతి పరిపాలన, ఇంత నీచమైన, దుర్మార్గమైన పాలన ఎప్పుడు చూడలేదు…
వాళ్ళు తట్టుకోలేక ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నారు…డిప్యూటీ మేయర్ చాలా మంచి పని చేశారు…ప్రజ అభిప్రాయం ఎట్ల ఉందో మనం ఇప్పుడు చూస్తున్నాం…ఈ పదిహేను రోజులు కష్టపడి పనిచేసి అరాచక పాలనను తరిమికొట్టాలి…

Related posts

త్యాగానికి ప్రతీక బక్రీద్‌…మాజీఎంపీ నామ

Ram Narayana

పాలేరు నియోజకవర్గాల్లో విద్యార్థులకు సొంత నిధులతో సైకిళ్ళు …మంత్రి పొంగులేటి

Ram Narayana

ఖమ్మంలో తుమ్మల వర్సెస్ పువ్వాడ నామినేషన్ లొల్లి…

Ram Narayana

Leave a Comment