కామ్రేడ్ ఎన్. శంకరయ్య…(102) కన్నుమూత
పాతతరం కమ్యూనిస్ట్ నేత శంకరయ్య
పీడిత ఉద్యమాలకు తీరని లోటని పలువురు నేతల సంతాపం ..
తమిళనాడు సీపీఎం సీనియర్ నేత మాజీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎన్. శంకరయ్య (102) కన్నుమూత…పుచ్చలపల్లి సుందరయ్య , ఐ ఎం ఎస్ నంబుద్రిపాద్ ,జ్యోతిబసు ,బసవపున్నయ్య , హరికిషన్ సింగ్ సుర్జీత్ సమకాలికులు శంకరయ్య మృతి పీడిత తాడిత ఉద్యమాలకు తీరని లోటుగా పలువురు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు …
రెండు రోజుల క్రితం జ్వరం లక్షణాలతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్సలు ఫలించక బుధవారం ఉదయం మృతి… ఆయన భౌతిక కాయం చెన్నై క్రోంపేట లోని ఆయన స్వగృహంలో ఉంచిన అనంతరం ప్రజల సందర్శార్ధం టి. నగర్ లో ని పార్టీ ఆఫీసుకు తరలింపు…తమిళనాడు… స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ (ఎం) నాయకుడు ఎన్ శంకరయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. ఇటీవల తీవ్ర జ్వరం రావడంతో శంకరయ్యను ఆయన కుటుంబసభ్యులు తమిళనాడు రాజధాని చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శంకరయ్య జ్వరంతోపాటు జలుబు సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. తమిళనాడుకు చెందిన ఎన్ శంకరయ్య దేశ స్వాతంత్య్రపోరాటంలో తనవంతు పాత్ర పోషించారు. కమ్యూనిస్టు నాయకుడిగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు. కాగా, శంకరయ్య భౌతికకాయాన్ని చెన్నైలోని సీపీఐ (ఎం) కార్యాలయానికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ కొంతసేపు ఉంచి, అనతరం ఆయన నివాసానికి తరలించనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు
.