Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంతమంది పోటీ చేస్తున్నారంటే?

  • జీహెచ్ఎంసీ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో పోటీలో 312 మంది
  • 15 నియోజకవర్గాల్లో ఇరవై మంది అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరణ
  • రంగారెడ్డి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో బరిలో 173 మంది

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటి మధ్యాహ్నం మూడు గంటలతో ముగిసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఎంతమంది పోటీ చేస్తున్నారో ఖరారైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 15 నియోజకవర్గాలలో ఇరవై మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో ఉన్నవారి జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేశారు. 15 స్థానాలకు గాను 312 మంది పోటీ చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో 173 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో 28 మంది, ఎల్బీ నగర్‌లో 38 మంది, మహేశ్వరంలో 27 మంది, రాజేంద్రనగర్‌లో 25 మంది, శేరిలింగంపల్లిలో 33 మంది, చేవెళ్లలో 12 మంది పోటీలో ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 30న ఓటింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి.

Related posts

ఖమ్మం జిల్లా ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పొన్నెకల్లు వద్ద శ్రీ చెతన్య ఇంజనీరింగ్ కాలేజీ …కలెక్టర్ విపి గౌతమ్

Ram Narayana

భద్రంగా ఖమ్మం లోకసభ ఈవీఎంలు…

Ram Narayana

ఛత్తీస్ గఢ్ లో ముగిసిన తుది విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Ram Narayana

Leave a Comment