Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఐటీ సోదాల్లో రాజకీయాలు …బీజేపీయేతర పక్షాలే టార్గెట్…

ఐటీ సోదాల్లో రాజకీయాలు …బీజేపీయేతర పక్షాలే టార్గెట్…
మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో తెల్లవారుజాము నుంచీ ఐటీ సోదాలు
హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఐటీ సోదాలు
రంగంలోకి 40 బృందాలు
మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో తెల్లవారుజాము నుంచీ సోదాలు
ఐటీ సోదాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు స్పందన
తనకు ఎలాంటి కంపెనీలు లేవని వెల్లడించిన బీఆర్ఎస్ లీడర్
రైస్ మిల్లులపైనే దాడులు జరుగుతున్నాయని వెల్లడి
కుట్రలో భాగంగానే ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఫైర్

తెలంగాణలో మళ్లీ ఐటీ సోదాల కలకలం రేగుతోంది…. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని ఐటీలో రాజకీయాలు చొప్పించబడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి…ప్రధానంగా ఐటీ , ఈడీ ,సిబిఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ తమ ప్రత్యర్థులపై ఉసిగోల్పోవుతుందనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నవేళ జరుగుతున్నా ఈదాడులు ముమ్మాటికీ కక్ష్యపూరితమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇటీవలనే కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-చైర్మన్ పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలు కంపెనీలు ,బంధువుల ఇళ్లపై ఏకకాలంలో 30 చోట్ల దాడులు నిర్వహించి రెండు రోజులు సోదాలు నిర్వహించారు ..బీఆర్ యస్ కు చెందిన మహేశ్వరం అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయి.గురువారం మిర్యాలగూడెం బీఆర్ యస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇళ్ళు ,రైస్ మిల్లులు, ఇతర కంపెనీలు ఆయన స్నేహితుడు శ్రీధర్ రెడ్డి ఇళ్ళు ,మిల్లులపై సోదాలు నిర్వహించారు . అధికంగా ఆదాయం ఉండి లెక్కలు చూపకుండా ఐటీ కట్టకుండా ఉన్న వాళ్ళ పై దాడులు జరపడం సహజంగా జరిగేదే కానీ ఈ దాడులు రాజకీయ పార్టీలను టార్గెట్ గా చేసుకొని జరపడం విమర్శలు దారితీస్తుంది…బీజేపీ పార్టీలో ఉన్న వ్యాపారాలు ,కాంట్రాక్టర్లు ,పారిశ్రామిక వేత్తల పై దాడులు జరపకపోడం గమనార్హం …

మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఇంట్లో తెల్లవారుజామున 4 గంటల నుంచీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటూ నల్గొండ, మిర్యాలగూడ‌లో 40 ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఒక్క నల్గొండలోనే 30 బృందాలు తనఖీలు చేపడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు నిల్వ చేసినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

గురువారం ఉదయం నుంచి జరుగుతున్న ఐటీ దాడులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు స్పందించారు. తన ఇంటిపై, తన సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులంటూ జరుగుతున్న ప్రచారం అంతా బూటకమని కొట్టిపడేశారు. జిల్లాలోని పలు చోట్ల ఉన్న రైస్ మిల్లులపై రెయిడ్స్ జరుగుతున్నాయని, ఆ రైస్ మిల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున మళ్లీ బరిలో నిలిచిన నల్లమోతు భాస్కర్.. వేములపల్లిలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని తేలడంతో తట్టుకోలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఎన్నికలలో తమను ఓడించే సామర్థ్యంలేక కుట్ర పన్ని ఇలా తప్పుడు వార్తలను ఉద్దేశపూర్వకంగా ప్రచారంలోకి తెస్తున్నాయని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. తనకు ఎలాంటి కంపెనీలు లేవని, పెద్ద మొత్తంలో డబ్బు లేదని నల్లమోతు స్పష్టం చేశారు. ఉన్నట్లు నిరూపిస్తే వారికే ఇచ్చేస్తానని నల్లమోతు భాస్కర్ సవాల్ విసిరారు.

Related posts

మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తాం: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన కాంగ్రెస్ నేతలు

Ram Narayana

బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌….ఠాక్రే  

Drukpadam

బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే వార్తలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందన!

Drukpadam

Leave a Comment