Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కొత్తగూడెం లో 40 వేల మెజార్టీతో గెలుస్తా…వనమా ధీమా…!

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు …తిరిగి ఎన్నికల్లో బీఆర్ యస్ తరుపున కారు గుర్తుపై పోటీచేస్తున్నారు …ఇప్పటికి నాలుగుసార్లు కొత్తగూడెం నుంచి విజయబావుటా వేగరవేసిన వనమా వయసు పై బడినప్పటికీ తనలో ఉత్సాహం తగ్గలేదు …ప్రజలకు సేవచేయాలనే తపన కనిపిస్తుంది.. ప్రచారం ఎలా సాగుతుంది ..మీ గెలుపు అవకాశాలు ఏమిటి అని “దృక్పధం” ఆయన్ను పలకరించింది…ఎన్నికల ప్రచారానికి వెళ్లే హడావుడిలో ఉన్న వనమా దృక్పధంతో కాసేపు ముచ్చటించారు …

నాగెలుపు నల్లేరు మీద నడకే… నాకు ఎవరు పోటీకాదు …నేను 40 వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ..ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా …నాలుగుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగానే గెలిచాను …అయితే కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి పనులు నన్ను ఆకర్షింప జేశాయి..అందువల్లనే కేసీఆర్ తో ప్రయాణం చేయాలనీ నిర్ణయించుకొని బీఆర్ యస్ చేరాను …అందుకు దగ్గట్లుగానే ఆయన నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్నారు …వనమగారు అంటూ ఆప్యాయంగా పలకరించేవారు …ఎప్పుడు ఏది అడిగినా, లేదు …కాదు అని అనలేదు … కేసీఆర్ సహకారంతో 3 వేల కోట్ల రూపాయలతో కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా…
ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఈసారి తప్పకుండ చేస్తా…కొత్తగూడెం అభివృద్దే నాద్యేయం …కొత్తగూడెం ప్రజలు నా ప్రాణసమానులు గత 50 ఏళ్లుగా వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్న …వారి నుంచి లభిస్తున్న మద్దతుకు కృతజ్ఞుడిని … పాల్వంచ , కొత్తగూడెం మంచినీటి సమస్యను తీర్చిన ఘనత నాదే …ముర్రేడు వాగుపై బ్రిడ్జి నిర్మాణం కొత్తగూడెం , పాల్వంచ పట్టణాలను అందంగా తీర్చిదిందింది నేనే …80 వేలమందికి ఇళ్ల పట్టాలు ఇప్పించాను …జిల్లాకు కొత్త కలెక్టరేట్ కార్యాలయాసముదాయం …ఎస్పీ కార్యాలయం వచ్చింది….
నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే మరోసారి కేసీఆర్ ను సీఎం చేయాలనీ ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు …ఇది ప్రజల్లో బలంగా కనిపిస్తుంది..

.నియోజకవర్గం కేంద్రమైన కొత్తగూడెం జిల్లా కేంద్రమైంది …అందుకు సీఎం కేసీఆర్ కు జిల్లా ప్రజలు , ప్రధానంగా ఏజన్సీ ప్రజలు రుణపడి ఉంటారు ..గతంలో జిల్లా స్థాయి పనులకు ఖమ్మం వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది …తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎంగా అద్భుతమైన పాలన అందించారు …రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు ..24 గంటల ఉచిత విద్యత్ ,రైతు బంధు , దళిత బంధు , బీసీలకు లక్ష రూపాయల సహాయం , గిరిజనులకు పోడుభూముల పంపిణి ,ఆసరా పెన్షన్లు , రైతు బీమా , ధరణి ఏర్పాటు , కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణను సంక్షేమ రాజ్యాంగ తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే …కొత్తగా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనేది మంచి కార్యక్రమం ఈ పథకం ద్వారా అర్హులైన వారందరికీ 5 లక్షల సహాయం అందజేస్తారు ..సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతిమహిళకు 3 వేలరూపాయలు ,రైతు బంధుపథకం 16 వేలకు పెంపు ..అర్హులైన వారందరికీ 400 సిలిండర్ పథకాలు పై ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తుందని వనమా అన్నారు ….

Related posts

తుమ్మలను బీజేపీలోకి ఆహ్వానిస్తాం: ఈటల రాజేందర్

Ram Narayana

కాంగ్రెస్‌లో చేరిన ఎల్లారెడ్డి చైర్మన్‌కు షాక్… అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్…

Ram Narayana

ముఖ్యమంత్రిని అవుతానని నేను అనుకుంటే అంతకంటే బుద్ధితక్కువ లేదు: పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment