Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సహాయం కోసం కేటీఆర్ కు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ట్వీట్

సహాయం కోసం కేటీఆర్ కు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ట్వీట్
-కేటీఆర్ రెస్పాన్స్ … మహిళకు సాయం
ప్రాబ్లమ్ సాల్వ్:కృతజ్ఞతలు చెప్పిన శివకుమార్
కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యాకు చెందిన మహిళ కుటుంబానికి సాయమందించాలని తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. మాండ్యాకు చెందిన శశికళ అనే మహిళ భర్త హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతి చెందారని, ఆస్పత్రి యాజమాన్యం రూ. 7.5 లక్షల బిల్లు వేసినట్లు డీకే శివకుమార్.. కేసీఆర్, కేటీఆర్‌ల దృష్టికి తీసుకొచ్చారు.రూ. 2 లక్షలు చెల్లిస్తామన్నా మృతదేహాన్ని అప్పగించలేదని డీకే శివకుమార్ తెలిపారు. ఈ క్రమంలో శివకుమార్ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. బాధితురాలి వివరాలు తెలియజేయాల్సిందిగా శివకుమార్‌ను కోరారు. మహిళ, ఆస్పత్రి బిల్లు వివరాలు తెలుసుకోవాలని తన సిబ్బందిని కేటీఆర్ ఆదేశించారు. ఆ తర్వాత సమస్య పరిష్కారమైందని కేటీఆర్ కార్యాలయం ట్విట్టర్ ద్వారా డీకే శివకుమార్‌కు వెల్లడించింది. కేటీఆర్ కు శివకుమార్ కృతజ్నతలు తెలిపారు .

 

Related posts

‘బ‌ద్వేలులో దొంగలు, పోలీసులు ఒక్క‌ట‌య్యారు’ అంటూ సి.ఎం ర‌మేశ్ ఆగ్ర‌హం.. 

Drukpadam

సుప్రీం తీర్పు వచ్చేవరకు కవిత విచారణకు వెళ్ళరు …లాయర్ భరత్!

Drukpadam

ఒకే కుటుంబంలోని నలుగురి దారుణ హత్య.. 16 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్

Drukpadam

Leave a Comment