Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ వచ్చేది లేదు …చచ్చేదిలేదు ..భట్టి ముఖ్యమంత్రా …? మధిర సభలో కేసీఆర్ ఎద్దేవా.!

భట్టి సీఎం అయ్యేది లేదు చచ్చేది లేదు ..కాంగ్రెస్ లో అరడజనుమంది ముఖ్యమంత్రులు ఉన్నారు …కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు…కాంగ్రెస్ కు 20 సీట్లకు మించి రావని స్పష్టం చేశారు ..బీఆర్ యస్ అధినేత సీఎం కేసీఆర్ మంగళవారం మధిర ఎన్నికల సభలో సీఎల్పీ నేత భట్టి టార్గెట్ తన ప్రసంగం కొనసాగించారు ..పట్టిలేని భట్టి వల్ల లాభంలేదని కాంగ్రెస్ కు 20 మించి రావు ఆయన సీఎం ఎలా అవుతాడని కేసీఆర్ ప్రశ్నించారు …నియోజకవర్గానికి ఆర్నెళ్లకొకసారి వస్తారు చుట్టపు చూపుగా అంటూ భట్టిపై విమర్శలు గుప్పించారు ..ఆయన వల్ల మధిరలో లాభంలేదు …ఎలాంటి అభివృద్ధి జరగలేదు …తమ ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే బీఆర్ యస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ ను గెలిపించండి …లేకపోతె పథకాలు రైతు బంద్ కొనసాగాలంటే బీఆర్ యస్ రావాల్సిందే అని కేసీఆర్ అన్నారు . మధిరలో ఎస్సీ లు ఎక్కువగా ఉన్నారు ..ఇది ఎస్సీ నియోజకవర్గం అందువల్ల కమల్ రాజ్ ను గెలిపించండి నియోజకవర్గం మొత్తం దళిత బంధు అమలు జరుపుతాం …భట్టి గెలిస్తే ఇది జరగదు … ఇటీవల ఒక టీవీ కార్యక్రమంలో భట్టి అంటున్నాడు …కాంగ్రెస్ వస్తే ధరణి తొలగిస్తారట..దాని బదులు భూమాత తెస్తారట …భూమాత కాదు …భూమేత తెస్తారు ..అని కేసీఆర్ కాంగ్రెస్ వాగ్దానాలపై ఎగతాళి చేశారు ..చింతకాని మండలం మొత్తానికి దళిత బంధు అములు చేశాం ..ఎవరు నన్ను అడగలేదు ..అములు తీరు పరిశీలించేందుకు రాష్ట్రంలో 4 మండలాలను ఎంపిక చేసినప్పుడు నేనే చింతకాని మండలం తీసుకున్న …ఎవరు నన్ను అడగలేదు …మీ ఎమ్మెల్యే కూడా అడగలేదు ..ఆకాల వర్షాలు వచ్చినప్పడు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు బోనకల్లు మండలం వచ్చాను …తిరిగి వెళుతున్నప్పుడు ఎంపీ నామ కూడా నా పక్కనే ఉన్నారు ..నలుగురు మహిళలు వచ్చారు ..వెంటనే కారు ఆపి కిందకు దిగాను …ఏమిటని వారిని అడిగితె మాకు చింతకానిలాగానే దళిత బంధు కావాలని అడిగారు …ఇస్తామని చెప్పాను…కమల్ రాజ్ ను గెలిపించండి దళిత బంధు ఇచ్చే భాద్యత నాదని హామీ ఇచ్చారు .

కాంగ్రెస్ నాయకులూ చెపుతున్నారు …75 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు వారే దేశాన్ని పరిపాలించారు …ఒరిగింది ఏమిటి …1956 లో తెలంగాణను ఏపీ లో కలిపారు ..58 సంవత్సరాలు ఉద్యమాలు చేసి రాష్ట్రము సాధించుకున్నాం …రాష్ట్రము ఇచ్చాం …ఇచ్చాం అని చెపుతూన్న కాంగ్రెస్ వల్లనే తెలంగాణ ఆలస్యం అయింది…2004 లో రాష్త్రం ఇస్తామంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాం జారిందేమిటి …చివరకు కేసీఆర్ చచ్చుడో ,తెలంగాణ వచ్చుడో అంటే తప్పని పరిస్థిల్లో ఇవ్వాల్సి వచ్చింది…అంతే ఎవరి దయ దాక్షణ్యాలమీదనే తెలంగాణ రాలేదని కేసీఆర్ అన్నారు …తెలంగాణ నిత్యం నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి..బోడేపూడి ఎమ్మెల్యేగా ఉండగా నిత్యం ఎండిన వరి కంకులు తీసుకోని అసెంబ్లీకి వచ్చి మాపంటలు ఎండిపోతున్నాయని మొత్తుకునే వారు …నేడు ఆపరిస్థితి లేదు ..పంటలకు పుష్కలంగా నీరు ఇస్తున్న చరిత్ర మాది …నేడు ధాన్యం పండిస్తున్న నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది…సీతారామ ప్రాజక్టు పూర్తీ అయితే నేడు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి . 4 కోట్లకు చేరుకుంటునని కేసీఆర్ అన్నారు ..తెలంగాణలోని ప్రతి అంగుళాన్ని బాగు చేసే భాద్యత నాదే…కాంగ్రెసోళ్లను నమ్ముకుంటే గోసపడతారు …దళితబంధు ,రైతు బంధు , 24 విద్యత్ కు మంగళంపాడటం ఖాయమని కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు .. ఓటు అనేది వజ్రాయుధం నేను చెప్పే మాటలు గ్రామాలకు వెళ్లి చర్చ పెట్టండి ..ఐదు సంవత్సరాల పాలనా కోసం వ్యక్తిని ఆయన గుణగణాన్ని ,పార్టీని చూసి మీరు ఎన్నుకోవాలి అని హితవు పలికారు … ఖమ్మం జిల్లాలోని మధిర , వైరా ఎన్నికల సభల్లో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు … మధిర అభ్యర్థి లింగాల కమల్ రాజ్ , వైరా అభ్యర్థి బానోత్ మదన్ లాల్ .. ఖమ్మం ఎంపీ ,బీఆర్ యస్ లోకసభ పక్ష నేత నామ నాగేశ్వరరావు ,ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు పాల్గొన్నారు ..

Related posts

కాంగ్రెస్‌ ప్రభుత్వం మనకంటే బాగా చేయాలని కోరుకుందాం!: హరీశ్ రావు

Ram Narayana

నేను ఎంపీగా గెలవడం ఖాయం… కేసీఆర్‌ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడం తప్పదు: రఘునందన్ రావు…

Ram Narayana

బీఆర్ యస్ పై కాంగ్రెస్ ఛార్జ్ షీట్ ఉద్యమం గడపగడపకు చేరాలి …సీఎల్పీ నేత భట్టి!

Ram Narayana

Leave a Comment