Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

మాజీ ఎంపీ వివేక్, ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలపై ఈడీ ప్రకటన

  • విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ సెక్యూరిటీస్ మధ్య రూ.100 కోట్ల లావాదేవీలు గుర్తించినట్లు వెల్లడి
  • వ్యాపారం ద్వారా రూ.20 లక్షల ఆదాయం వచ్చిందని, ఆస్తులు, అప్పులతో రూ.64 కోట్ల బ్యాలెన్స్ షీట్ ఉందన్న ఈడీ
  • ఎంఎస్ సెక్యూరిటీస్‌కు యశ్వంత్ రియాల్టర్స్ మాతృసంస్థగా గుర్తించామన్న ఈడీ

మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో జరిగిన సోదాలపై బుధవారం ఈడీ ప్రకటన చేసింది. రూ.8 కోట్ల బ్యాంకు లావాదేవీలపై ఫిర్యాదు వచ్చినట్లు ఈడీ తెలిపింది. పోలీసుల ఫిర్యాదు మేరకు సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ సెక్యూరిటీస్ మధ్య రూ.100 కోట్ల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది. వ్యాపారం ద్వారా రూ.20 లక్షల ఆదాయమే వచ్చిందని, ఆస్తులు, అప్పులతో కలిపి రూ.64 కోట్లతో బ్యాలెన్స్ షీట్ ఉందని తెలిపింది.

లావాదేవీలు మాత్రం రూ.200 కోట్లకు పైగా గుర్తించినట్లు పేర్కొంది. కంపెనీలను వివేక్ పరోక్షంగా నియంత్రిస్తున్నారని, ఎంఎస్ సెక్యూరిటీ సంస్థ ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపింది. మరోవైపు ఎంఎస్ సెక్యూరిటీస్ సంస్థకు యశ్వంత్ రియాల్టర్స్ మాతృ సంస్థ అని, ఇందులో విదేశీ షేర్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఈడీ తెలిపింది. వివేక్ ఫెమా నిబంధనలకు ఉల్లంఘించి విదేశంలో సంస్థను ఏర్పాటు చేశారన్నారు.

నేను చెప్పింది నిజమైంది.. విజయశాంతి

  • వివేక్ ఇళ్లు, కార్యాలయాలలో సోదాలపై ఈడీ ప్రకటనపై స్పందించిన రాములమ్మ
  • బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని నేను చెప్పింది నిజమని తెలిసిపోతోందని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ ఫిర్యాదు చేయగానే బీజేపీ ఈడీ, ఐటీలను పంపిస్తోందని ఆరోపణ
VijayaShanti responds on ED press note

మాజీ ఎంపీ వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలపై ఈడీ విడుదల చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. తాను చెప్పినట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తెలిసిపోతోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేత బాల్క సుమన్ ఈసీకీ ఫిర్యాదు చేయగానే బీజేపీ ఈడీ, ఐటీలను సోదాల కోసం పంపిస్తోందని ఆరోపించారు. అందుకే వివేక్ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిగాయన్నారు. ఇన్ని రోజులు బీజేపీలో ఉన్నప్పుడు ఎలాంటి ఈడీ, ఐటీ రైడ్స్ జరగలేదన్నారు. బీజేపీ నుంచి బయటకు రాగానే ఈ దాడులు దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. అయినా సరే కొట్లాడుదాం… నేను అయినా, వివేక్ అయినా, మిగతా ఉద్యమకారులు ఎవరైనా… భయపడేది లేదని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు ఈడీ ప్రకటన కాపీని విజయశాంతి అటాచ్ చేశారు.

Related posts

నాగార్జున సత్యహరిచంద్రుడు ఏమి కాదు …సిపిఐ నేత నారాయణ విసుర్లు

Ram Narayana

తెలంగాణ సీఎంఓ వాట్సాప్ చానెల్ ప్రారంభం

Ram Narayana

స్వలాభం కోసమే కందాల పార్టీ మారారు…కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో .చైర్మన్ పొంగులేటి

Ram Narayana

Leave a Comment